భూ రికార్డులు, కొలతలు రెడీ!
‘జిల్లాల విభజన’కు సిద్ధమవుతున్నాం..
1924 నాటి దస్త్రాల కంప్యూటరీకరణ
కార్యాలయాల ఎంపిక, రికార్డుల విభజన పూర్తి
వివరాలు వెల్లడించిన శాఖ ఏడీ ప్రభాకర్
కాజీపేట : కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లాలకు అనుగుణంగా భూరికార్డులు, కొలతల శాఖ కార్యాలయానికి సంబంధించి చేపట్టిన దస్త్రాలు, సిబ్బంది విభజన ప్రక్రియ పూర్తి కావొచ్చిందని శాఖ ఏడీ ప్రభాకర్ తెలిపారు. కాజీపేటలోని కార్పొరేషన్ సర్కిల్ కార్యాలయ ఆవరణలో ఉన్న భూమి రికార్డులు, కొలతల శాఖ జిల్లా కార్యాలయంలో ఆయన శుక్రవారం మాట్లాడారు. ఈ సందర్భంగా తమ శాఖ కార్యాలయానికి సంబంధించి జిల్లాల విభజన అంశాలపై పలు వివరాలను వెల్లడించారు.
సమగ్ర సమాచారం లేకున్నా..
ఇప్పటి వరకు జిల్లా యూనిట్‌గా సేవలు అందించిన భూరికార్డులు, కొలతల శాఖ కార్యాలయం ఇక నుండి నాలుగుగా విడిపోయి ప్రజలకు సత్వర సేవలందించేలా కలెక్టర్ కరుణ చొరవతో ఏర్పాట్లు చేస్తున్నామని ఏడీ ప్రభాకర్ తెలిపారు. జిల్లాల విభజనపై సమగ్ర సమాచారం లేనప్పటికీ ముసాయిదాకు అనుగుణంగా మహబూబాబాద్, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాలను దృష్టిలో పెట్టుకుని రికార్డులను వేరు చేస్తున్నట్లు చెప్పారు. సిబ్బంది తక్కువగా ఉన్నా ప్రత్యేక సిబ్బందిని నియమించుకుని అవసాన దశలో ఉన్న 1924 నాటి దస్త్రాలను కంప్యూటరీకరణ చేయడంతో పాటు వేరు చేస్తున్నామని తెలిపారు. అధికారికంగా ప్రొఫెసర్ జయశంకర్(భూపాలపల్లి), మహబూబాబాద్ జిల్లాలకు సంబంధించిన రికార్డులు, సిబ్బంది పంపిణీ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి తుది ముసాయిదా రాగానే మిగతా జిల్లాలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇక భూపాలపల్లి, మహబూబాబాద్‌ల్లో ఇప్పటికే కార్యాలయాల ఏర్పాటుకు కావాల్సిన భవనాలను ఎంపిక చేశామని తెలిపారు. ఇక కాజీపేట మినీ సర్కిల్ కార్యాలయ ఆవరణలోనే హన్మకొండ జిల్లా కార్యాలయం కొనసాగుతుందని ఆయన చెప్పారు.
ఏడీలుగా ఇన్స్పెక్టర్లు
ప్రస్తుతం తమ శాఖకు సంబంధించి జిల్లాలో తన(ఏడీ)తో పాటు ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఆరుగురు డిప్యూటీ ఇన్స్పెక్టర్లు, ఓ సూపరింటెండెంట్, 27 మంది సర్వేయర్లు, ఎనిమిది మంది డిప్యూటీ సర్వేయర్లు, ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు, ఐదుగురు జూనియర్ అసిస్టెంట్లు ఉన్నారనిప్రభాకర్ తెలిపారు. వీరిలో ఇద్దరు ఇన్స్పెక్టర్లకు కొత్తగా ఏర్పడనున్న జిల్లాల్లో రెండింటికి ఏడీలుగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించనుండగా.. మరో జిల్లాకు తాను కొనసాగే అవకాశముందని పేర్కొన్నారు. ఇక కింది స్థాయి సిబ్బందిని కార్యాలయ నిర్వహణకు అనుగుణంగా కేటాయించనున్నట్లు తెలిపారు. ప్రస్తుత వరంగల్ జిల్లాలో 50మండలాలకు 27 మంది సర్వేయర్లే ఉండగా.. వారే మిగతా మండలాలకు ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఇదేక్రమంలో ఉన్న సిబ్బందితోనే కొత్త జిల్లాల కార్యకలాపాలు సాగేలా ఏర్పాట్లు చేసుకుంటున్నామని ప్రభాకర్ వివరించారు.
లుండగా 27సర్వేయర్ పోస్టుల్లో మాత్రమే సిబ్బంది ఉన్నారని, మిగిత మండలాల్లో పోస్టులు ఖాళీగా ఉండటంతో ఇప్పటికే అనేక మంది సర్వేయర్లు పక్క మండలాల అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తున్నట్లు చెప్పారు. ఉన్న సిబ్బందితోనే జిల్లా కార్యాలయాల ఏర్పాటుకు సన్నహాలు పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. నిజాం కాలంనాటి దస్త్రాలే అయినా అన్ని రకాల గ్రామాల చిత్రపటాలు, సేత్వార్, టిపన్లు అవసరమైన అన్నీ భద్రపర్చడంతో పాటు డిజిటలైజేషన్ ప్రక్రియ చురుకుగా సాగుతోందని వివరించారు. అందుబాటులోని లేని కొన్ని గ్రామాల చిత్రపటాలు, కొన్ని దస్త్రాలను అవసరానికి అనుగుణంగా భూ పరిపాలన రాష్ట్ర కమిషనర్ కార్యాలయం నుంచి తెప్పించి ప్రజా సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నామని తెలిపారు. భూములకు ఉహించని ధరలు పెరుగడం కూడా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా భూవివాదాలు పెరుగడానికి కారణమవుతోందని ప్రభాకర్ పేర్కొన్నారు.