East Sussex
-
దగ్గు రాకపోయినా దగ్గితే పనిష్మెంట్
లండన్: ఇప్పట్లో కోవిడ్ దశ ముగిసే సూచనలు కనిపించడం లేదు. దీంతో ఎన్నాళ్లని లాక్డౌన్ అంటూ భయంతో బతుకు వెళ్లదీయడం అని ఒక్కొక్కటిగా అన్నిరకాల కార్యకలాపాలను తెరుచుకునేందుకు అనుమతులు ఇస్తున్నారు. అందులో భాగంగానే బడులకు కూడాఆ పచ్చజెండా ఊపుతున్నారు. దీంతో యునైటెడ్ కింగ్డమ్లో నిన్నటి నుంచే స్కూళ్లు పున: ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా తూర్పు ససెక్స్‌లోని ఆర్క్ అలెక్జాండ్ర అకాడమీ కరోనా వైరస్ రెడ్ లైన్స్ పేరిట ప్రత్యేక నిబంధనలను రూపొందించింది. "విద్యార్థులు ఉద్దేశపూర్వకంగా దగ్గకూడదు, తుమ్మకూడదు. కరోనా గురించి ఎవరూ అనుచిత వ్యాఖ్యలు చేయరాదు. వ్యక్తికి వ్యక్తికి మధ్య కనీస దూరం ఉండాల్సిందే. (చదవండి: 66 రోజుల్లో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్?) ఈ ఆంక్షలను ఉల్లంఘించే విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వారిని స్కూలు నుంచి ఇంటికి పంపించేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు" అని పాఠశాల యాజమాన్యం హెచ్చరించింది. ఒక్క మాటలో చెప్పాలంటే దగ్గు రాకపోయినా సరే దగ్గుతూ నటించినా, కరోనా మీద కుళ్లు జోకులు వేసినా వారిపై చర్యలు తప్పవు. కఠినంగా అనిపిస్తోన్న ఈ నిబంధనలను పిల్లలు అలవాటు చేసుకుంటారో, లేదా రూల్స్ అతిక్రమించి పనిష్మెంట్ తీసుకుంటారో! కాగా వీటితో పాటు ప్రభుత్వం ఆదేశించిన నిబంధనలను కూడా విద్యార్థులు పాటించాల్సిందే. ఫేస్ మాస్క్ ధరించడం, ఒకరికి మరొకరికి మధ్య భౌతికదూరం పాటించడం వంటివి తప్పనిసరి. (చదవండి: ‘టీసీ’ లేకున్నా అడ్మిషన్..) -
ఫొటో కోసం.. ఆత్మహత్య
లండన్ : పిచ్చి పతాక స్థాయి.. ఇంతకు మించి అనడానికి.. ప్రపంచ భాషల్లో పదాలు కూడా ఉండవు. సెల్ఫీలు వచ్చాక.. యువత వాటికి బానిసలుగా మారారు. అందులో సందేహం లేదు. సెల్ఫీల మోజులో ఎందరో ప్రాణాలు కోల్పోయారు.. కోల్పోతున్నారు. తాజాగా ఒక్క ఫొటో కోసం కొరియా యువతి ఆత్మహత్య చేసుకుంది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన ఇంగ్లాండ్‌లో జరిగింది. ఇంగ్లాండ్‌లోని ఈస్ట్ససెక్స్ ప్రాంతాన్ని స్వర్గంగా పర్యాటకులు భావిస్తుంటారు. ఎత్తయిన మైదాన ప్రాంతాలు.. హోరెత్తె అలలో సాగే ఇంగ్లీష్ ఛానెల్ సముద్రం.. దూరం నుంచి మంచు పర్వతాలు.. ఇలా ఉంటుంది ఈ ప్రాంతం. ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు అందరిలాగే దక్షిణ కొరియా నుంచి హేవోన్ కిమ్ (23) అనే యువతి వచ్చింది. ఎత్తయిన మైదాన ప్రాంతం.. తల వంచి చూస్తే.. సముద్రం.. అలలు కనిపిస్తాయి. ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూసిన ఆమెకు 200 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకితే.. అన్న ఆలోచన వచ్చింది. అదే తడవుగా.. అక్కడ ఉన్న ఒక వ్యక్తి చేతికి తన మొబైల్ ఇచ్చి ఫొటోలు తీయమని కోరింది. అతడు మొబైల్‌తో ఫొటోలు తీస్తుండగా.. అడుగులు వెనక్కి వేసుకుంటి.. నా కిందకు దూకుతున్నా.. ఫొటోలు తీయండి.. అని గట్టిగా చెప్పింది.. అతడు దగ్గరకువచ్చే లోపు.. కిందకు దూకేసింది. ఆమెను రక్షించేందుకు తీరప్రాంత నౌకాదళ అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. 200 అడుగుల ఎత్తు నుంచి దూకడంతో.. కిమ్ నీళ్లలో పడేలోపు మరణించింది. కిమ్ కిందకు దూకే సయంలో అక్కడే ఉన్న ప్రత్యక్షసాక్షి మాట్లాడుతూ.. ఆమె ఫొటోల కోసం కిందకు దూకుతున్నా అనే మాట అన్నదని చైనాకు చెందిన టూరిస్ట్ జియాంగ్ జాంగ్ అన్నారు. -
విష మేఘాలు: 250 మంది ఆసుపత్రి పాలు
-
విష మేఘాలు: 233 మంది ఆసుపత్రి పాలు
సాక్షి, ఈస్ట్ ససెక్స్: క్లోరిన్ వాయు మేఘాలు ఇంగ్లండ్‌లోని ఈస్ట్ ససెక్స్‌లో కలకలం రేపాయి. బీచ్‌లో సేద తీరుతున్న ప్రజలను విష వాయువు తాకడంతో కళ్ల మంటలు, గొంతు రాజుకుపోవడం, ఊపిరాడకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని 233 మందికి పైగా బాధితులను అంబులెన్స్‌ల సాయంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా వచ్చిన విష వాయు మేఘం నుంచి విపరీతమైన దుర్వాసన వచ్చిందని బీచ్‌లోని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ఆ తర్వాత ఆ వాయువు పీల్చుకున్న ప్రతి వ్యక్తికి ఏదో రకమైన ఇబ్బంది ఎదుర్కొన్నట్లు చెప్పారు. కాగా, ఆసుపత్రికి తరలించిన బాధితులకు డాక్టర్లు ప్రత్యేక సూట్లు వేసుకుని వైద్య సేవలు అందిస్తున్నారు. విష వాయువును పీల్చుకున్న వ్యక్తి నుంచి వెలువడే గాలి కూడా ప్రమాదమేనని చెబుతున్నారు. బీచ్ వైపు ఎవరూ వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బీచ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. క్లోరిన్ వాయువు బీచ్ చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల నుంచి వెలువడిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, అధికారులు ఈ కోణాన్ని కొట్టిపారేస్తున్నారు. అలాంటిది జరిగే కచ్చితంగా ఆధారాలు లభ్యమవుతాయన్నారు. గ్యాస్ ఎక్కడి నుంచి వెలువడిందనే దానికి అసలు ఆధారాలేవి ఇప్పటివరకూ లభ్యం కాలేదని చెప్పారు.