పర్యాటకానికి కేటాయింపులేవీ?
ఘనత వహించిన మన ముఖ్యమంత్రి గారి మాటలకీ, చేతలకీ హస్తిమశకాంతరమంత తేడా ఉంటుందని అందరికీ తెలుసు. రాజ ధాని విషయంలో ఆయనగారు చేస్తున్న ప్రగల్భాలు ప్రపంచం మొత్తానికి తెలిసిపోయాయి. పర్యాటక రంగానికి ఆయన కేటా యింపులు చూస్తే ఎవరికైనా మతిపోక తప్పదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకు మిగిలిన 13 జిల్లాల్లో చారిత్రక ప్రాధాన్యం కలి గిన ప్రదేశాలు 277 ఉన్నాయి. వాటి సంరక్షణ కోసం రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం కేటాయించినది కేవలం 30 లక్షలు.
ఆ సొమ్ము ను 277 చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రదేశాలకు సమానంగా విభ జిస్తే ఒక్కొక్కదానికి కేవలం రూ.10,830లు మాత్రమే వస్తాయి. ఇంత తక్కువ సొమ్ముతో పర్యాటక అభివృద్ధి ఏ స్థాయిలో చేయా లని కలలు కంటున్నారో మరి. హైదరాబాద్ సెక్రటేరియట్లోని లేక్ వ్యూ క్యాంప్ ఆఫీసు మార్పులు, చేర్పులు, హంగుల కోసం సుమారు 50 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టబోతున్నారని ప్రచార సాధనాలు కోడై కూస్తున్నాయి. రాష్ట్రంలోని వందలాది చారిత్రక వారసత్వ ప్రదేశాల రక్షణకు కేవలం 30 లక్షల రూపాయలు సరి పోతాయి కానీ, నారా చంద్రబాబు నాయుడి గారి ఆఫీసును తీర్చి దిద్దడానికి 50 కోట్లు కావాలట. ముఖ్యమంత్రి మాటలకు, చేతలకు పొంతన లేదనడానికి ఇంతకంటే సరైన నిదర్శనం ఏం కావాలి?
- ఈదుపల్లి వెంకటేశ్వరరావు, ఏలూరు