18 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు
మిర్యాలగూడ అర్బన్ : అజయ్జ్యోతి ఉచిత గ్రామీణ కంటి వైద్యశాల, అన్నపూర్ణ నేత్రాలయం డాక్టర్ ఆళ్ల రామశేషయ్య ఆధ్వర్యంలో బుదవారం పట్టణంలో 18 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించారు. 36మంది రోగులను పరిక్షించిన అనంతరం 18 మందికి ఆపరేషన్ అవసరాన్ని గుర్తించి ఆపరేషన్లను నిర్వహించారు. అనంతరం రోగులందరికీ దుస్తులు, పండ్లు, కంటి అద్దాలు, మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సిబ్బంది రెడ్యానాయక్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.