ఏలూరు ఎంపీ గన్‌మన్ ఆత్మహత్య
ఏలూరు(పశ్చిమగోదావరి జిల్లా): ఏలూరు ఎంపీ మాగంటి బాబు గన్‌మాన్ ఎం ఆదామ్(45) సోమవారం పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు తాగిన ఆదామ్‌ను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కాసేపటికే మరణించాడు. ఆదామ్ ప్రస్తుతం ఏలూరులోని విద్యానగర్‌లో నివాసం ఉండేవాడు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు.