Ellen DeGeneres Show
-
అవును నా ఇంట్లో దెయ్యాలున్నాయి.. తరిమేశాను: నటి
వాషింగ్టన్: వెనకటి రోజుల్లో అంటే ఏమో కానీ.. ప్రస్తుతం మాత్రం దెయ్యాలు, భూతాలు అంటే చాలామంది కొట్టి పారేస్తారు. కేవలం సినిమాల్లో తప్ప వాస్తవంగా దెయ్యాలు ఉండవు అనే వారు చాలా మంది. అయితే దెయ్యాల ఉనికిని నమ్మేవారు కూడా కొకోల్లలు. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే.. ప్రముఖ హాలీవుడ్ నటి ఒకరు తాను చాలా ఏళ్ల పాటు దెయ్యాలతో కలిసి జీవించానని.. చివరకు ఒకరోజు వాటిని తరిమే వ్యక్తిని తీసుకువచ్చి.. దెయ్యాల గోల నుంచి విముక్తి పొందానని తెలిపారు. సామాన్యులు ఎవరైనా ఇలాంటి మాటలు చెబితే పెద్దగా పట్టించుకోం.. కానీ ఏకంగా హాలీవుడ్ నటే వెల్లడించడంతో.. ఈ టాపిక్ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆ వివరాలు.. ఇటీవలే క్లో జావో 'ఎటర్నల్స్'తో అజాక్గా తన సూపర్ హీరో అరంగేట్రం చేసిన ప్రముఖ నటి సల్మా హాయక్, తన లండన్ ఇల్లు దెయ్యాలతో నిండిపోయిందని తెలిపారు. ది ఎల్లెన్ డిజెనెరెస్ షోకు హాజరైన సందర్భంగా హాయక్ సంచలన విషయాలు వెల్లడించారు. ఇంట్లో తాను ఎదుర్కొన్న విచిత్ర పరిస్థితుల గురించి.. దెయ్యాలను తరిమికొట్టిన విధానం గురించి వెల్లడించారు. (చదవండి: ఆ ఇంట్లో సంకెళ్ల దెయ్యం.. రాత్రయితే..) ఈ సందర్భంగా హాయక్ మాట్లాడుతూ.. ‘‘లండన్‌లో ఉన్న నా ఇంట్లో చిత్ర, విచిత్రమైన, ఒళ్లు గగుర్పొడిచే సంఘటనలు చోటు చేసుకునేవి. పియానో దానంతట అదే మోగేది. మూడో అంతస్తులో ఉన్న లైట్లు.. వాటంతట అవే వెలిగేవి.. ఆరిపోయేవి. ప్రారంభంలో ఇవన్ని చూసి బెదిరిపోయాను. మనుషులు ఎవరు కనిపించే వారు కారు. ఆ తర్వాత ఇది దెయ్యాల పనే అని నాకు అర్థం అయ్యింది. కాకపోతే నేను ఎప్పుడు వాటిని ప్రత్యక్షంగా చూడలేదు’’ అని తెలిపారు. (చదవండి: వైరల్: ఈమె మనిషా.. దెయ్యామా?!) ‘‘ఈ బాధ నుంచి బయటపడటానికి ఓ వ్యక్తిని తీసుకువచ్చాను. నాకు మా ఇంట్లో ఎప్పుడు దెయ్యం కనిపించలేదు. కానీ విచిత్ర సంఘటనలు చోటు చేసుకునేవి. అందుకే దెయ్యాలను తరిమే వ్యక్తిని తీసుకువచ్చాను. దెయ్యాలు ఉన్నాయో లేవో తెలియదు. కానీ నా ఈ ప్రయత్నం వల్ల వాటిని ఇంటి నుంచి తరిమేశాను అనే తృప్తి కలుగుతుంది.. భయం తగ్గి ప్రశాంతంగా ఉంటాను. ఇక నేను తీసుకువచ్చిన వ్యక్తి దగ్గర దగ్గర 20 దెయ్యాలను పట్టుకున్నట్లు తెలిపాడు’’ అని వెల్లడించారు. హాయక్ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం రేకెత్తిస్తున్నాయి. చదవండి: ఇంట్లో దెయ్యం.. కాలనీ మొత్తం ఖాళీ -
అతనితో నాకు పిల్లలు కూడా ఉన్నారు: దీపిక
’ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’ సినిమాతో హాలీవుడ్లో అదరిపోయే ఎంట్రీ ఇచ్చింది దీపిక పదుకొనే. ఇప్పటికే దేశంలో విడుదలైన ఈ సినిమా త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను పలుకరించబోతున్నది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో హీరో విన్ డీజిల్ తో కలిసి బిజీగా ఉన్న దీపిక ప్రఖ్యాత టీవీ షో ఎలెన్ డిజెనరస్ షోలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ’ట్రిపుల్ ఎక్స్’లో తన సహ నటుడు, హాలీవుడ్ సూపర్‌స్టార్ విన్ డీజిల్ పట్ల తనకెంతో క్రష్ ఉందని వెల్లడించింది. అంతేకాదు అతనితో ముద్దుముద్దుగా ఉన్న పిల్లల్ని కూడా కన్నట్టు పేర్కొంది. అయితే, నిజజీవితంలో కాదు తన ఊహాల్లో అని ట్విస్టు ఇచ్చింది. ’ట్రిపుల్ఎక్స్’ సినిమాలో దీపిక, విన్ డీజిల్ మధ్య కెమెస్ట్రీ బాగా పండిందని, దీనివెనుక సీక్రెట్ ఏమిటి? మీ మధ్య రొమాన్స్ ఏమైనా ఉందా? అని టీవీషో వ్యాఖ్యాత ఎలెన్ డిజెనరస్ అడిగింది. దీపిక బదులిస్తూ.. ’నిప్పు లేనిది పొగ రాదు కదా! కానీ ఇదంతా నా ఊహల్లోనే.. మేం కలిసి ఉన్నట్టు, మా మధ్య కెమెస్ట్రీ ఉన్నట్టు నాలో నాకు అనిపిస్తుంది. మేం కలిసి జీవించినట్టు.. మాకు అద్భుతమైన పిల్లలు కూడా పుట్టినట్టు అనిపిస్తుంది. ఇదంతా నా ఊహల్లోనే’ అంటూ దీపిక పేర్కొంది. హాలీవుడ్లో తనదైన ముద్ర వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న దీపిక.. బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్‌తో ప్రేమలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రమోషన్ కోసం భారత పర్యటనకు వచ్చిన విన్ డీజిల్ కూడా దీపిక బాయ్‌ఫ్రెండ్ రణ్వీర్ సింగేనని స్పష్టం చేశారు.