ఆంగ్ల త్రైమాసిక పత్రికకు రచనలు ఆహ్వానం
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: ఆంగ్ల భాషోపాధ్యాయ సంస్థ(ఎల్టా) ఆధ్వర్యంలో అక్టోబర్‌లో ఆంగ్లభాషా త్రైమాసిక పత్రికను విడుదల చేయనున్నట్లు ఎల్టా జిల్లా అధ్యక్షుడు నాగం రఘురాంరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, కెజీబీవీ, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూళ్లలోని ఉపాధ్యాయులు, విద్యార్థుల నుంచి వ్యాసాలు, కథలు, కవితలు, హాస్యం, బాల సాహిత్యం, కార్టూన్లతోపాటు తమకు నచ్చిన అంశాలపై ఆంగ్లలో రచనలను ఆహ్వానిస్తున్నట్లు పే ర్కొన్నారు. రచనలను eltambnr@gmail.com మెయిల్‌కు పంపించాలని, వివరాలకు సెల్ నెం : 9885031043ను సంప్రదించాలని కోరారు.