ఎంసెట్ కౌన్సెలింగ్‌పై కేంద్రం జోక్యం చేసుకోవాలి: ఎస్ఎఫ్ఐ
హైదరాబాద్: రెండు రాష్ట్రాల మధ్య ఎంసెంట్ కౌన్సెలింగ్‌పై తలెత్తిన గందరగోళాన్ని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహణ ప్రక్రియలో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలంటూ శుక్రవారం మాసబ్‌ట్యాంకులోని ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద ఎస్ఎఫ్ఐ నేతలు ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.శోభన్ నాయక్ మాట్లాడుతూ.. ఎంసెట్ నిర్వహణ కోసం రెండు రాష్ట్రాలకు చెందిన లక్షలాది విద్యార్థులు ఎదురుచూస్తూ మనోవేదనకు గురవుతున్నారని అన్నారు. ఏ రాష్ట్ర విద్యార్థులకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలే రీయింబర్స్‌మెంటు ఫీజు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఉన్నత విద్యామండలి కార్యదర్శి కె.సతీష్‌రెడ్డికి వినితి పత్రం అందజేశారు.