సకాలంలో ఎంసెట్ కౌన్సెలింగ్ పూర్తి చేస్తాం
హైదరాబాద్: హైకోర్టు తీర్పు కాపీ అందిన తర్వాతే ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్పై అధికారిక నిర్ణయం ప్రకటిస్తామని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. ఆయనతో పాటు మండలి ఉన్నతాధికారులు, జేఎన్టీయూ అధికారులు బుధవారం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో సమావేశమయ్యారు.
ఈ సందర్బంగా ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్పై హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం పాపిరెడ్డి మాట్లాడుతూ సకాలంలో కౌన్సెలింగ్ పూర్తి చేసి సుప్రీం గైడ్ లెన్స్ ప్రకారమే తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు.