emesco
-
‘ఎమ్మెస్కో’కు లోక్‌నాయక్ పురస్కారం
పెదవాల్తేరు (విశాఖ తూర్పు): తెలుగుభాషాభివృద్ధికి విశేష కృషి చేస్తున్న ఎమెస్కో సంస్థకు లోక్‌నాయక్ ఫౌండేషన్ అవార్డు అందజేయనున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చెప్పారు. విశాఖలోని సంస్థ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2020 జనవరి 18న విశాఖలోని వుడా బాలల థియేటర్లో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఎమెస్కో ప్రధాన కార్యనిర్వాహకుడు డి.విజయ కుమార్‌కు ఈ పురస్కారం కింద రూ.2 లక్షల నగదు, ప్రశంసాపత్రాన్ని అందజేస్తామన్నారు. విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్యకు జీవన సాఫల్య పురస్కారం కింద రూ.లక్ష నగదు అందజేస్తామని వివరించారు. లోక్‌నాయక్ ఫౌండేషన్ ద్వారా అందజేసే పురస్కార మొత్తాన్ని రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచినట్లు చెప్పారు. జీఓ–81తో ప్రయోజనమే.. ప్రభుత్వం విడుదల చేసిన జీఓ–81తో పలు ప్రయోజనాలు ఉన్నాయని యార్లగడ్డ చెప్పారు. ఈ జీవో వల్ల సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఓక్రిడ్జ్ పాఠశాలల్లో సైతం తెలుగుభాషకు స్థానం లభిస్తుందన్నారు. పాదయాత్రలో కలిసిన ప్రజల అభ్యర్థన మేరకే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెడుతున్నారని స్పష్టం చేశారు. సమావేశంలో ఫౌండేషన్ ప్రతినిధి డాక్టర్ బాబయ్య పాల్గొన్నారు. -
ప్రచురణ కర్తలు.. సాంస్కృతిక రాయబారులు
న్యూఢిల్లీ: ప్రచురణకర్తలు దేశ సాంస్కృతిక రాయబారుల్లాంటి వారని ఎమెస్కో పబ్లిషర్స్ అధినేత ధూపాటి విజయకుమార్ అన్నారు. రచయితలకూ, ప్రజలకూ మధ్య వారధిలా ఉంటూ పుస్తకాల్లో నిక్షిప్తమై ఉండే విజ్ఞాన వ్యాప్తికి ప్రచురణకర్తలు దోహదం చేస్తారని ఆయన చెప్పారు. శనివారం ఇక్కడి కేంద్ర సాహిత్య అకాడమీలో ‘భారతీయ సాహిత్యంలో ప్రచురణ కర్తల పాత్ర’ అన్న అంశంపై ఆయన ప్రసంగించారు. దేశంలోని వివిధ భాషల ప్రచురణకర్తలతో కేంద్ర సాహిత్య అకాడమీ ఏటా ఒక సమ్మేళనం ఏర్పాటు చేసి వారి మధ్య ఒప్పందాలకు వీలు కల్పించాలని సూచించారు. జ్ఞానపీఠ ఫౌండేషన్ నిర్దేశకుడు లీలాధర్ మాండ్లోయి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో డి.కె. ఏజెన్సీస్ అధినేత రమేశ్ మిట్టల్, డీసీ పబ్లిషర్స్ అధినేత రవి డీసీ తదితరులు మాట్లాడారు. -
కాలక్షేపానికి పుస్తకాలు చదివేవారు లేరు
సీరియస్ వ్యాసంగంగా పుస్తక పఠనం స్వీయ, జీవిత చరిత్రలపై నేటి తరం ఆసక్తి ఎమెస్కో అధినేత విజయకుమార్ రాజమమేంద్రవరం కల్చరల్ : ‘నేటి సమాజంలో కాలక్షేపానికి పుస్తకాలు చదివేవారు కనుమరుగవుతున్నారు... పుస్తక పఠనాన్ని సీరియస్ వ్యాసంగంగా నేటి తరం తీసుకుంటోంది... ఇది మంచిపరిణామమే' అన్నారు పుస్తక ప్రచురణ రంగంలో ఎనిమిది దశాబ్దాలకు పైగా సేవలందిస్తోన్న ఎమెస్కో సంస్థ అధినేత విజయకుమార్. ‘పుస్తక సంబరాలు’ పేరిట నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో భాగంగా మంగళవారం నిర్వహించిన పుస్తక ప్రియుల పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎమెస్కో పేరు ఎలావచ్చిందంటే.. సుమారు 82 సంవత్సరాలకు మునుపే ఎం.శేషాచలం అండ్ కో పుస్తక ప్రచురణ వ్యాపారాన్ని ప్రారంభించింది. ఇంగ్లిష్‌లో ఎంఎస్ కో అని రాసేవారు. ప్రజల నానుడిలో అది కాస్తా ఎమెస్కో అయి కూర్చుంది. 1988–89లో నేను సంస్థను టేకోవర్ చేశాను. నవలలకు ఆదరణ తగ్గింది నవలలకు 1960 ప్రాంతంలో ప్రజల్లో మంచి ఆదరణ ఉండేది. యద్దనపూడి సులోచనారాణి నవల 'సెక్రటరీ' సుమారు 80 ముద్రణలు పొందింది. నేటి తరం స్వీయ చరిత్రలు, జీవిత చరిత్రల విషయంలో ఆసక్తి చూపుతున్నారు. అయితే క్లాసికల్ నవలలకు నేడు ఆదరణ పెరిగింది. పిలకాగణపతి శాస్త్రి విశాలనేత్రాలు వెయ్యిపుస్తకాలు అమ్ముడవటానికి నాడు చాలా కాలం పట్టింది. ఇటీవల జరిగిన పునర్ముద్రణ పాఠకుల ఆదరణ చూరగొంటోంది. తిరుపతి వేంకట కవులోల ఒకరయిన చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి 'కథలు–గాథలు' పునర్ముద్రించాం. సాహితీ దిగ్గజాలు నోరి నరసింహశాస్త్రి, వేదం వేంకట్రాయశాస్త్రి రచనలు వెలుగులోకి తెస్తాం. స్వీయచరిత్రలు సమకాలీన సమాజం, నాటి వ్యక్తులను గురించి సాధికారికంగా చెప్పగలుగుతాయి. కేవలం గొప్పవారి చరిత్రలే అక్కర లేదు–సామాన్యుడి జీవిత చరిత్రలు కూడా కొన్ని సందర్భాల్లో పనికి వస్తాయి. కొమ్మూరి వేణుగోపాలరావు డిటెక్టివ్ నవలలను ముద్రించి, హైదరాబాద్‌లో ఓ పుస్తక ప్రదర్శనశాలలో ‘యుగంధర్ మళ్ళీ వచ్చాడు’ అన్న బ్యానర్ ఏర్పాటు చేశాం. ప్రజలు పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. కొత్త పదాలను చేర్చి, శబ్దరత్నాకరాన్ని ముద్రించాం. అంతర్జాతీయ ప్రమాణాలలో బాలసాహిత్యాన్ని వెలుగులోకి తెస్తాం. పుస్తకాలపై ఆసక్తి లేకపోలేదు హైదరాబాద్‌లోని కూకట్పల్లి నుంచి 87 ఏళ్ల వృద్ధుడు బంజారాహిల్స్‌లోని మా కార్యాలయానికి ‘కొవ్వలి’ నవల కావాలని వచ్చారు. పుస్తకాలపై ఆసక్తి లేదనడం తొందరపాటే -
కాలక్షేపానికి పుస్తకాలు చదివేవారు లేరు
సీరియస్ వ్యాసంగంగా పుస్తక పఠనం స్వీయ, జీవిత చరిత్రలపై నేటి తరం ఆసక్తి ఎమెస్కో అధినేత విజయకుమార్ రాజమమేంద్రవరం కల్చరల్ : ‘నేటి సమాజంలో కాలక్షేపానికి పుస్తకాలు చదివేవారు కనుమరుగవుతున్నారు... పుస్తక పఠనాన్ని సీరియస్ వ్యాసంగంగా నేటి తరం తీసుకుంటోంది... ఇది మంచిపరిణామమే' అన్నారు పుస్తక ప్రచురణ రంగంలో ఎనిమిది దశాబ్దాలకు పైగా సేవలందిస్తోన్న ఎమెస్కో సంస్థ అధినేత విజయకుమార్. ‘పుస్తక సంబరాలు’ పేరిట నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో భాగంగా మంగళవారం నిర్వహించిన పుస్తక ప్రియుల పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎమెస్కో పేరు ఎలావచ్చిందంటే.. సుమారు 82 సంవత్సరాలకు మునుపే ఎం.శేషాచలం అండ్ కో పుస్తక ప్రచురణ వ్యాపారాన్ని ప్రారంభించింది. ఇంగ్లిష్‌లో ఎంఎస్ కో అని రాసేవారు. ప్రజల నానుడిలో అది కాస్తా ఎమెస్కో అయి కూర్చుంది. 1988–89లో నేను సంస్థను టేకోవర్ చేశాను. నవలలకు ఆదరణ తగ్గింది నవలలకు 1960 ప్రాంతంలో ప్రజల్లో మంచి ఆదరణ ఉండేది. యద్దనపూడి సులోచనారాణి నవల 'సెక్రటరీ' సుమారు 80 ముద్రణలు పొందింది. నేటి తరం స్వీయ చరిత్రలు, జీవిత చరిత్రల విషయంలో ఆసక్తి చూపుతున్నారు. అయితే క్లాసికల్ నవలలకు నేడు ఆదరణ పెరిగింది. పిలకాగణపతి శాస్త్రి విశాలనేత్రాలు వెయ్యిపుస్తకాలు అమ్ముడవటానికి నాడు చాలా కాలం పట్టింది. ఇటీవల జరిగిన పునర్ముద్రణ పాఠకుల ఆదరణ చూరగొంటోంది. తిరుపతి వేంకట కవులోల ఒకరయిన చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి 'కథలు–గాథలు' పునర్ముద్రించాం. సాహితీ దిగ్గజాలు నోరి నరసింహశాస్త్రి, వేదం వేంకట్రాయశాస్త్రి రచనలు వెలుగులోకి తెస్తాం. స్వీయచరిత్రలు సమకాలీన సమాజం, నాటి వ్యక్తులను గురించి సాధికారికంగా చెప్పగలుగుతాయి. కేవలం గొప్పవారి చరిత్రలే అక్కర లేదు–సామాన్యుడి జీవిత చరిత్రలు కూడా కొన్ని సందర్భాల్లో పనికి వస్తాయి. కొమ్మూరి వేణుగోపాలరావు డిటెక్టివ్ నవలలను ముద్రించి, హైదరాబాద్‌లో ఓ పుస్తక ప్రదర్శనశాలలో ‘యుగంధర్ మళ్ళీ వచ్చాడు’ అన్న బ్యానర్ ఏర్పాటు చేశాం. ప్రజలు పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. కొత్త పదాలను చేర్చి, శబ్దరత్నాకరాన్ని ముద్రించాం. అంతర్జాతీయ ప్రమాణాలలో బాలసాహిత్యాన్ని వెలుగులోకి తెస్తాం. పుస్తకాలపై ఆసక్తి లేకపోలేదు హైదరాబాద్‌లోని కూకట్పల్లి నుంచి 87 ఏళ్ల వృద్ధుడు బంజారాహిల్స్‌లోని మా కార్యాలయానికి ‘కొవ్వలి’ నవల కావాలని వచ్చారు. పుస్తకాలపై ఆసక్తి లేదనడం తొందరపాటే.