ఆర్టీసీ ఇచ్చే పరిహారం పెంపు
సర్వీసులో ఉండగా మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.6 లక్షలు
సాక్షి, అమరావతి: ఆర్టీసీలో విధి నిర్వహణలో ఉండగా మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని పెంచేందుకు యాజమాన్యం అంగీకరించింది. ప్రస్తుతం ఎంప్లాయ్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (ఈడీఎల్ఐఎఫ్) ద్వారా చెల్లిస్తున్న రూ.3.60 లక్షల పరిమితిని రూ.6 లక్షల వరకు పెంచారు.
ఈ ఏడాది జనవరి 31వ తేదీ తర్వాత మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. 2014 సెప్టెంబర్ 1 నుంచి ఉద్యోగుల పింఛన్ రికవరీ వాటాను రూ.6,500 నుంచి రూ.15వేలకు పెంచే విధంగా చట్ట సవరణ జరిగిన సంగతి తెలిసిందే.