షార్కు సేవలు అభినందనీయం
సూళ్లూరుపేట: శ్రీహరికోట రాకెట్కేంద్రలోనే 25ఏళ్లు సేవలందించి, ఈ ఏడాది 9 ప్రయోగాలు విజయవంతం చేయడంలో ముఖ్యపాత్ర పోషించిన ఉద్యోగుల సేవలు అభినందనీయమని షార్ డైరెక్టర్ పి.కున్హీకృష్ణన్ అన్నారు. మంగళవారం రాత్రి షార్లో బ్రహ్మప్రకాష్హాలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీహరికోట రాకెట్ కేంద్రంగా అభివృద్ధి చెందడానికి అందరి శ్రమ దాగి ఉందన్నారు. అనంతరం షార్ కంట్రోలర్ జేవీ రాజారెడ్డి మాట్లాడుతూ 24 గంటలు పని చేసే మనస్తత్వం కలిగిన శ్రీహరికోట ఉద్యోగులు రాకెట్ ప్రయోగాలైనా, ప్రకృతి వైపరీత్యాలైనా మేము ఉన్నాం అని ముందుకొచ్చి పనిచేయడం నిజంగా అభినందనీయమన్నారు. 2014–15 సంవత్సరం నాటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 45 మంది ఉద్యోగులకు జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో షార్ అధికారులు ఎంబీఎన్ మూర్తి, వి.రంగనాథన్, ఆర్.వెంకట్రామన్, సెల్వరాజ్, గోపీకృష్ణ పాల్గొన్నారు.