తమిళ సినిమా రీమేక్‌లో సునీల్
కమెడియన్‌గా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న సునీల్, హీరోగా ఆ స్థాయిని అందుకోలేకపోతున్నాడు. అడపాదడపా హిట్ సినిమాలు వస్తున్నా కెరీర్‌ను మలుపు తిప్పే స్థాయి సక్సెస్‌లు మాత్రం అందుకోలేకపోతున్నాడు. ఇటీవల విడుదలైన ఈడు గోల్డ్ ఏహె కూడా నిరాశపరచటంతో రీమేక్ సినిమాల మీద దృష్టి పెడుతున్నాడు. కొత్త కథలతో ప్రయోగాలు చేసే కన్నా.. ఆల్రెడీ సక్సెస్ అయిన కథ అయితే సేఫ్ అని భావిస్తున్నాడు.
అందుకే తమిళ్లో జీవి ప్రకాష్ హీరోగా తెరకెక్కిన 'ఎన్నక్కు ఇన్నోరు పేర్ ఇరుక్కు' సినిమాను తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు. తమిళ్లో ఈ సినిమాను నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ సంస్థే తెలుగులోనూ నిర్మిస్తోంది. జీవీ చేసిన పాత్రకు సునీల్ అయితే కరెక్ట్ అని భావించిన నిర్మాణ సంస్థ 'నాకు ఇంకో పేరుంది' పేరుతో ఈ సినిమాను రీమేక్ చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.