ఏ కవి అయినా సత్యాన్ని చెప్పాలి
తెలుగు సాహిత్యపీఠం డీన్ ఎండ్లూరి
‘ప్రజా పత్రిక’ 90వ వార్షికోత్సవం
రాజమహేంద్రవరం కల్చరల్ :
మను ధర్మం ఒకటి, మానవ ధర్మం మరొకటి, ఆర్షధర్మం ఒకటి, జనధర్మం మరొకటి, ప్రతిభాపాటవాలు, సాహితీప్రాభవాలు ఏ ఒక్కరి సొత్తూ కాదని తెలుగు విశ్వ విద్యాలయం బొమ్మూరు సాహిత్యపీఠం డీ¯ŒS ఆచార్య ఎండ్లూరి సుధాకర్ అన్నారు. శనివారం ప్రకాష్‌నగర్ ధర్మంచర కమ్యూనిటీ హాలులో జరిగిన ప్రజాపత్రిక 90వ వార్షికోత్సవ సభకు ఆయన అధ్యక్షత వహించారు. ప్రతి కవీ దేశకాల ధర్మాలను గుర్తించాలని, వాల్మీకి నుంచి నానీలు రా సే కవుల వరకు తమ కాలధర్మానికి కట్టుబడి ఉన్నారని అన్నారు. కవి ఏ సామాజిక వర్గానికి చెందిన వాడయినా నిజం చెప్పగలిగి ఉండాలన్నారు. ఆధునిక కాలంలో జీవిస్తున్న వారందరూ ఆధునికులు కారని, మూడు వందల సంవత్సరాలకు మునుపు జీవించిన వేమన ఆధునిక కవి కాకపోడని విశ్లేషించారు. కాగా పలువురు మాట్లాడుతూ సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రజాపత్రికను నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న దేవీ సుదర్శ¯ŒS దంపతుల్ని అభినందించారు.
అలరించిన కవి సమ్మేళనం
ఈ సందర్భంగా జరిగిన కవి సమ్మేళనంలో విభిన్న అంశాలపై పలువురు కవులు వినిపించిన స్వీయ కవితలు అలరించాయి. ‘కాషాయం రంగు ఒకరిది, ఆకుపచ్చది మరొకరిది అయితే..మరి మువ్వన్నెల జండా ఎవరిది?’ (మహమ్మద్ ఖాదర్‌ఖా¯ŒS), ‘ర్యాగింగు, యాసిడ్ రాక్షస దాడులు, వరకట్న దహనాల వధలు మెండు’(బి.వి.రమాదేవి), ‘అమ్మవారిగ ప్రణతులందుకుంటున్న అతివ– గడప దాటాలంటే భయపడుతోంది’ (మల్లెమొగ్గల గోపాలరావు), ‘అక్షరమ్ము జ్ఞానభిక్షిడు జగతిని– అక్షరమ్మె వెలుగిడు అవనినెల్ల’(డాక్టర్ బి.వి.ఎస్.మూర్తి) అంటూ స్వీయకవితలను వినిపించారు. డాక్టర్ డి.నీలకంఠరావు, డాక్టర్ ఎస్.వి.రాఘవేంద్రరావు,యార్లగడ్డ మోహనరావు, అయ్యగారి వెంకటరామయ్య, జోస్యుల రామచంద్రశర్మ, మహీధర రామశాస్త్రి తదితరులు స్వీయకవితలు, పద్యాలు వినిపించారు. పద్మశ్రీ హల్దర్ నాగ్, రాయగడ రచయితల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఆనందరావు పట్నాయక్ , రావణ శర్మ, సత్తి భాస్కరరెడ్డి, డోలేంద్రప్రసాద్, డాక్టర్ పి.జె.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. పత్రిక గౌరవ సంపాదకుడు సుదర్శ¯ŒS దంపతులు అతిథులను సాదరంగా ఆహ్వానించారు.