‘విష్ణు’లో ముగిసిన సాఫ్ట్వేర్ టెస్టింగ్ శిక్షణ
భీమవరం : భీమవరం విష్ణు మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 7 నుంచి ఐదు రోజులుపాటు సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనే అంశంపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమం ఆదివారం ముగిసింది. జాతీయస్థాయిలో ఏర్పాటు చేసిన వర్క్‌షాపులో వివిధ ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన అధ్యాపకులు శిక్షణ పొందారు. ఈ శిక్షణ కార్యక్రమంలో సాఫ్ట్వేర్ రంగంలో టెస్టింగ్ విభాగం పనితీరు, ఉద్యోగావకాశాలు, పారిశ్రామిక టెస్టింగ్ విధానాలు, టెస్టింగ్ టూల్స్, సాఫ్ట్వేర్ రిస్క్ మేనేజమెంట్ వంటి వివిధ అంశాలపై సవివరంగా చెప్పారు. ఎన్ఐటీ తిరుచ్చికి చెందిన డాక్టర్ రామ్సుందర్మోహన్, హైదరాబాద్ డీఆర్డీవోకు చెందిన మనీష్‌తివారీ, వరంగల్ ఎన్ఐటీకి చెందిన డాక్టర్ రాజునాయక్, పూణే ఇన్నోవియన్స్ టెక్నాలజీస్‌కు చెందిన మనీష్‌కుమార్ జైన్, అఖిలేష్ ఐదురోజుల పాటు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి.శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.శ్రీనివాసరాజు, వి.పురుషోత్తమరాజు, సమన్వయకర్తలు పి.కిరణ్‌శ్రీ, కె గణేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.