మ్యాచ్ ఫిక్సింగ్: ఏడుగురు బ్రిటిష్ ఆటగాళ్ల అరెస్టు
మ్యాచ్ ఫిక్సింగ్ భూతం కేవలం క్రికెట్లోనే కాదు.. ఫుట్‌బాల్‌కు కూడా పాకేసింది. వాయవ్య ఇంగ్లండ్‌లోని ఫుట్‌బాల్ లీగ్ క్లబ్బులకు చెందిన ఏడుగురు ఆటగాళ్లను మ్యాచ్‌ఫిక్సింగ్ కుంభకోణంలో అరెస్టు చేశారు. వీళ్లంతా 18 నుంచి 30 సంవత్సరాలలోపు వాళ్లే. మరో ఆరుగురు ఆటగాళ్లను కూడా అనుమానం మీద డిసెంబర్ నెలలోనే అరెస్టుచేసినా, తర్వాత బెయిల్ మీద వారిని విడుదల చేశామని, ఇప్పుడు వాళ్లను కూడా మళ్లీ అరెస్టు చేశామని నేషనల్ క్రైం ఏజెన్సీ తెలిపింది.
ద సన్ పత్రిక అందించిన ఆధారాలతో దర్యాప్తు ప్రారంభించామని, ఇది మరింత కొనసాగుతుందని ఎన్సీఏ వర్గాలు తెలిపాయి. మొత్తం 13 మంది ఆటగాళ్లను లంచాలు, మనీలాండరింగ్ నేరాల గురించి విచారిస్తున్నారు. ఫుట్‌బాల్ అసోసియేషన్‌కు కూడా ఈ దర్యాప్తు, అరెస్టుల గురించి ఎన్సీఏ వర్గాలు సమాచారం అందించాయి.