రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
సుల్తానాబాద్: టవేరా వాహనం.. ద్విచక్రవాహనాన్ని ఢీకొని ఓ మహిళ మృతిచెందింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి గ్రామ రాజీవ్ రహదారిపై ఆదివారం జరిగింది. ఈ ప్రమాదంలో ఎరవెల్లి సుజాత (45) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందినట్టు ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. స్థానికులు, ఎస్సై కథనం ప్రకారం.. కాట్నపల్లి నుంచి నీరుకుల్ల గ్రామపంచాయతీ పరిధిలోని రంగంపల్లి స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై మలహల్రావు, సుజాత వెళ్తున్నారు.
రాజీవ్ రహదారిపై డివైడర్ ఉండడంతో రంగంపల్లికి నేరుగా వెళుతుండగా కరీంనగర్ నుంచి సుల్తానాబాద్ వైపు వస్తున్న టవేరా వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. టవేరా వాహనం అతివేగంగా రావడమే ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. మృతురాలికి భర్త మలహల్రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.