దొంగ అరెస్ట్
అనంతపురం సెంట్రల్: తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగను త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ మురళీకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. పెనుకొండ మండలం రాంపురం గ్రామానికి చెందిన ఎరికల గంగాధర్ జల్సాలకు అలవాటు పడ్డాడు. అందుకు అవసరమైన డబ్బు కోసం దొంగగా మారాడు. 2009 నుంచి అనేక కేసుల్లో నేరం రుజువుకు కావడంతో జైలుకెళ్లాడు.
ఈ ఏడాది మే ఐదవ తేదీ వరకు కర్ణాటకలోని కోలార్ జైలులో శిక్ష అనుభవించాడు. జైలు నుంచి బయటకు వచ్చిన ఏడు రోజులకే రొద్దంలో సహకారబ్యాంకులో రూ. లక్ష నగదు దొంగతనం చేశాడు. అనంతపురంలో కూడా పలు దొంగతనాలకు పాల్పడ్డాడు. ఆదివారం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్నట్లు సమాచారం అందుకున్న సీఐ మురళీకృష్ణ, ఎస్ఐలు జయపాల్‌రెడ్డి, నారాయణరెడ్డి, సిబ్బంది రెడ్‌హ్యాండెడ్‌గా గంగాధర్‌ను పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 11 తులాలు బంగారు, 10 తులాలు వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.