ప్రాణాలు ఇస్తారు, తీస్తారు..!
ఫుట్‌బాల్ అంటే ప్రాణం ఇచ్చే అభిమానుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా కోట్లలో ఉంటుంది. ఆట కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడే వాళ్ల సంఖ్య చాలా ఎక్కువ. అవసరమైతే ఫుట్‌బాల్ కోసం ప్రాణం ఇస్తారు. తిక్కపుడితే ప్రాణాలు తీస్తారు కూడా... ముఖ్యంగా యూరప్, దక్షిణ అమెరికా ఖండాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఫుట్‌బాల్‌పై అభిమానం దురభిమానంగా మారిన సందర్భాలు అనేకం.
ఎస్కోడార్ కాల్చివేత...
ఫిఫా 2014 ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో బ్రెజిల్ ప్లేయర్ మార్సెలో చేసిన సెల్ఫ్ గోల్ గుర్తుందా.. సరిగ్గా 20 ఏళ్ల కిందట 1994లో అమెరికా ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్‌లో కొలంబియా ప్రముఖ ఆటగాడు ఆండ్రెస్ ఎస్కోబార్ అచ్చం ఇలాగే సెల్ఫ్ గోల్ చేశాడు. పొరపాటున చేసిన ఈ గోల్ చివరికి అతని ప్రాణాలనే బలిగొంది. ఆ గోల్ వల్లే తమ జట్టు ప్రపంచకప్ నుంచి ఇంటిదారి పట్టినందుకు కొలంబియా అభిమా నులు కొందరు తీవ్ర ఆ వేదనకు లోనయ్యారు. అంతే ఎస్కో బార్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో విమ ర్శలు చేశారు. అయితే అమెరికా నుంచి తిరి గొచ్చిన రెండు రోజులకే ఎస్కోబార్‌ను మెడెలిన్‌లోని ఓ రెస్టారెంట్ దగ్గర సాకర్ అభి మానులు కాల్చి చంపారు. తాను పొరపాటున సెల్ఫ్ గోల్ చేశానని చెప్పినా వారు వినలేదు. దీంతో కొలంబియా ఓ అద్భుత ఆటగాడిని కోల్పోయింది. అయితే సాకర్‌పై అభిమానం ఆటగాళ్ల హత్యకు దారి తీసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. నెల్సన్ రివేరా (సాల్వడార్), ఒరేన్ సింప్సన్ (జమైకా) ఇలా పలువురు ఆటగాళ్లు దురాభిమానానికి బలైన వాళ్లే.
అభిమానుల ఆగ్రహం కట్టలు తెగితే...
ఓ ఆటగాడి అద్భుతమైన ప్రదర్శన కారణంగా ప్రత్య ర్థులకు ఏదైనా నష్టం జరగడం వల్లనో, లేదంటే ఆటగాడి పేలవ ప్రదర్శన కారణంగా తమ జట్టు ఓడి పోవడం వల్లనో అభి మానులు కోపోద్రిక్తులైన ఘటనలు కోకొల్లలు. క్లబ్ మ్యాచ్ దగ్గరి నుంచి ప్రపంచకప్ వరకు కొన్ని సందర్భాల్లో అభిమానులు హద్దులు దాటి ప్రవర్తించారు. కొన్నిసార్లు అభి మానులు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. రెండేళ్ల కిందట ఈజిప్ట్‌లో అల్ అహ్లి-అల్ మస్రీ అనే జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 70 మందికి పైగా ప్రాణాలను బలిగొంది. మస్రీ జట్టు 3-1తో తమ జట్టు అహ్లిపై విజయం సాధించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అంతే స్టేడియంలో బీభత్సం సృష్టించారు. రెండు జట్ల అభిమానులు మారణా యుధాలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. దీనికి తోడు తొక్కిసలాట కూడా జరిగింది. ఈ ఘటనకు బాధ్యులైన 21 మంది సాకర్ అభిమానులకు అక్కడి కోర్టు మరణశిక్ష విధించింది. 2003లో పొలాండ్‌లో జరిగిన ఓ సాకర్ మ్యాచ్‌లో ఫ్యాన్స్ బీభత్సం సృష్టించారు. కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. పలువురు గాయపడ్డారు. 1974లో టోటెన్ హాట్స్పూర్-ఫెయెనూర్డ్ మధ్య జరిగిన యూఈఎఫ్ఏ కప్ ఫైనల్ మ్యాచ్‌లో...1985 యూరోపియన్ కప్ ఫైనల్లో లివర్‌పూల్-జువెంటస్ మధ్య జరిగిన మ్యాచ్‌లో... 1985లో బర్మింగ్ హామ్-లీడ్స్ మధ్య జరిగిన ఈపీఎల్ మ్యాచ్‌లో ఇరు జట్లకు చెందిన అభిమానులు దాడులు చేసుకున్నారు. ఒకరినొకరు గాయపర్చుకున్నారు.
రిఫరీలూ బలయ్యారు
ఫుట్‌బాల్‌లో రిఫరీల పాత్ర కీలకం. ఒక రకంగా మైదానంలో వాళ్లు చెప్పిందే వేదం. అయితే రిఫరీలు కూడా అప్పుడప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసు కుంటారు. వాళ్లు తీసుకున్న నిర్ణయాలు ఆటగాళ్లకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఇది రిఫరీల ప్రాణాలను కూడా తీసింది.
గత ఏడాది అమెరికా ఉతా రాష్ట్రంలోని సాల్ట్‌లేక్ సిటీలో రికార్డో పొర్టిల్లో అనే రిఫరీకి ఓ టీనేజ్ సాకర్ ప్లేయర్ పంచ్ ఇచ్చాడు. యెల్లో కార్డ్ చూపినందుకు గట్టిగా కొట్టడంతో రిఫరీ గాయపడ్డారు. ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చని పోయారు. 2013లో బ్రెజిల్‌లోని సావోపాలోలో జరిగిన ఓ సాకర్ మ్యాచ్‌లో రిఫరీని అభిమానులు కొట్టి చంపడమే కాకుండా.. శవా న్ని ముక్కలు ముక్కలుగా కోసి అత్యంత పాశవికంగా వ్యవహరించారు. అయితే వాళ్లు అలా వ్యవహరిం చడానికి కారణం కూడా ఉంది. మ్యాచ్ సందర్భంగా జోస్నిర్ అనే ఆటగాడిని రిఫరీ సిల్వా బహిష్కరిం చడంతో వివాదం మొదలైంది. అది కాస్తా చినికిచినికి గాలివానగా మారింది. దీంతో ఆగ్రహోదిక్తుడైన రిఫరీ కత్తితో ఆటగాడిని పొడిచాడు. జోస్నిర్ ఆస్పత్రిలో మరణించాడు. దీనికి ప్రతీకారంగా రిఫరీపై ఇలా దాడులకు దిగారు.