న్యూయార్క్ వర్సిటీలో భారత శాస్త్రవేత్తకు ఉన్నత పదవి
న్యూయార్క్: ప్రముఖ భారతీయ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ కాటేపల్లి శ్రీనివాసన్ న్యూయార్క్ యూనివర్సిటీలోని పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ మెకానికల్ ఇంజనీరింగ్‌కు చెందిన నవకల్పనల పీఠానికి(ఈజెన్ క్లీనర్ చైర్) అధిపతిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన వర్సిటీ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్లో ఇంజనీరింగ్ డీన్‌గా ఉన్నారు. ఆయన విద్య, సాంకేతిక రంగాల్లోనే కాకుండా శాస్త్రీయ ఆవిష్కరణల్లో కూడా కృషి చేశారు. భారత్‌లో జన్మించిన శ్రీనివాసన్ గతంలో మేరీలాండ్, యేల్ వర్సిటీల్లో పనిచేశారు.