EVeium
-
ఆ హై-స్పీడ్ ఈ-స్కూటర్లు వచ్చేశాయిగా.. ఫీచర్లు, ధర?
సాక్షి, ముంబై: ఈవీయం మూడు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆధారిత మెటా4కి చెందిన ఆటో విభాగం ఎల్లీసియం ఆటోమోటివ్స్ ఈవీయం పేరుతో కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. కాస్మో, కామెట్ , జార్ అనే పేరుతో వీటిని తీసుకొచ్చింది. వీటి ధరలు వరుసగా( ఎక్స్-షోరూమ్) వరుసగా రూ. 1.44 లక్షలు, రూ.1.92 లక్షలు, 2.16 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. వీటి బుకింగ్‌లు ఆగస్టు 8 నుంచి మొదలు కానున్నాయి. మూడు ఇ-స్కూటర్లు ఒకే 72V 31 Ah లిథియం-అయాన్ బ్యాటరీతో శక్తితో పని చేస్తాయి. అయితే వీటి మైలేజీ, పరిధి, ఛార్జింగ్ టైం, ఎలక్ట్రిక్ మోటారు భిన్నంగా ఉంటాయి. కాస్మో, కామెట్ రెండూ 2000W ఎలక్ట్రిక్ మోటార్‌తో వచ్చినప్పటికీ, టాప్-ఆఫ్-ది-లైన్ జార్ 4000W ఎలక్ట్రిక్ మోటారుతో వచ్చింది. జార్, కామెట్ రెండూ ఒకే ఛార్జ్‌పై 150 కి.మీ పరిధిని, కాస్మో ఒకే ఛార్జ్‌తో 80 కి.మీ పరిధిని అందిస్తాయి. ఈ స్కూటర్లు స్పీడ్ మోడ్లు (ఎకో, నార్మల్, స్పోర్ట్స్) లభ్యం. కీలెస్ స్టార్ట్, యాంటీ-థెఫ్ట్ ఫీచర్, లేటెస్ట్ LCD డిస్ప్లే, రీజెనరేటివ్ బ్రేకింగ్, మొబైల్ యాప్ కనెక్టివిటీ, రియల్ టైమ్ ట్రాఫికింగ్, ఓవర్-స్పీడ్ అలర్ట్, జియోఫెన్సింగ్, లొకేట్ మై వెహికల్ ఫీచర్లు ప్రధానంగా ఉన్నాయి. కాస్మో అతి తక్కువ వేగాన్ని గంటకు 65 కి.మీ, కామెట్, జార్ రెండూ గంటకు 85 కిలీమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటాయి. భారతీయ మార్కెట్లో తమ బ్రాండ్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని, తమ మూడు ఈ-స్కూటర్లు వినియోగదారుల మనసు దోచుకుంటాయని విశ్వసిస్తున్నామని కంపెనీ ప్రమోటర్ ముజమ్మిల్ రియాజ్ తెలిపారు. -
ఎల్లీసియం మేడిన్ ఇండియా ‘ఈవీయం ఈ-స్కూటర్లు’ త్వరలోనే
సాక్షి, ముంబై: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆధారిత మెటా4కి చెందిన ఆటో విభాగం ఎల్లీసియం ఆటోమోటివ్స్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను త్వరలోనే లాంచ్ చేయనున్నట్టు బుధవారం ప్రకటించింది. ‘ఈవీయం’ అనే బ్రాండ్ పేరుతో మూడు మేడ్ ఇన్ ఇండియా ఈ-స్కూటర్లను తీసుకొస్తున్నట్టు వెల్లడించింది. 250 ఏకరాల్లో తెలంగాణలోని జహీరాబాద్‌లోని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లోనే వీటిని తయారు చేస్తున్నట్టు సంస్థ తెలిపింది. భారత ప్రభుత్వ పంచామృత విజన్‌తో ఇ-మొబిలిటీ మిషన్‌లో ఎల్లీసియం ఆటోమోటివ్స్ 100 శాతం భారతీయ ఎలక్ట్రిక్ వెహికల్ వెంచర్‌ను లాంచ్ చేశామని వెల్లడించింది. అలాగే EVeium సొంత టెలిమాటిక్స్ యాప్ అందజేస్తుందని, ఇది డీజీ-లాకర్, సమీప ఛార్జింగ్ స్టేషన్ లొకేషన్, జియో-ఫెన్సింగ్ లాంటి ఫీచర్లను అందిస్తుందని పేర్కొంది. గ్లోబల్ ఇంధన ధరల సంక్షోభం, పర్యావరణ పరిరక్షణ అవగాహనతో దేశీయ మార్కెట్లో మూడు ఈ-స్కూటర్లను పరిచయం చేస్తున్నామని సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ ఆదిత్య రెడ్డి తెలిపారు. ఎలక్ట్రిక్ స్కూటర్లు, సైకిళ్లు, ఎలక్ట్రిక్ బైక్‌లతో సహా అత్యుత్తమ EV ఆఫర్లను అందించడానికి పని చేస్తుందన్నారు. భారత ప్రహుత్వ ఫేమ్-II నిబంధనలకనుగుణంగా భారతీయ వినియోగదారుల కోసం సరసమైన ధర, నాణ్యతతో ఈవీలను తీసుకురావాలని భావిస్తున్నట్టు META4 గ్రూప్ సీఈవో ముజమ్మిల్ రియాజ్ అన్నారు. తెలంగాణలో ఈ-వెహికల్స్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా స్మార్ట్ గ్రీన్ మొబిలిటీలోవోల్ట్లీ ఎనర్జీ ద్వారా పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. 15ఎకరాల సబ్సిడీ భూమిని అందిస్తున్న ఈ ప్లాంట్ కోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.