మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత
రాజాపేట : మొక్కలు నాటడం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని హరితహారం ప్రత్యేక అధికారి, అడిషినల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ మోహన్చంద్ ఫర్గెయిన్ అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. మండలంలో ఇప్పటివరకు నాటిన మొక్కలు, వాటి పరిస్థితి, సంరక్షణ తదితర వివరాల గురించి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. హరితహారం క్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికతో నిర్వహిస్తుందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 17 కోట్ల 29 లక్షల మొక్కలు నాటగా జిల్లాలో కోటి 41లక్షల మొక్కలు నాటినట్లు చెప్పారు. నాటిన ప్రతి మొక్క బతికేలా చర్యలు తీసుకోవాలన్నారు. చనిపోయిన మొక్కలు స్థానంలో వెంటనే కొత్త మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ కొమ్మగల్ల యాదగిరి, ఏపీఓ రాములు తదితరులు పాల్గొన్నారు.