evtiging
-
హడ్కోకాలనీలో స్ట్రీట్‌ఫైట్
శ్రీకాకుళం రూరల్ : సమయం రాత్రి 7.15 నిమిషాలు...కాలనీ వాసులంతా తమతమ ఇళ్లముందు కాస్తా సేదతీరుతున్నారు. మరికొంతమంది టీవీలు చూస్తున్నారు. ఇంతలో కొంతమంది ఆటోలపై, మరికొంతమంది బైక్‌లపైన వచ్చారు. ఇష్టం వచ్చినట్లుగా రోడ్డుపై ఉన్న సామాన్లు తన్నుకుంటూ పోయారు. దొరి కిన వారిని పిడుగుద్దులతో గుద్దడం, కర్రలతో కొట్టడం...వీధుల్లో పరుగులు పెట్టించడం అంతా ఓ స్ట్రిట్ఫైట్ను తలపించిం ది. ఈ వ్యవహారమంతా ఎక్కడో కాదు.. నగర పరిధిలోని స్థానిక హడ్కోకాలనీలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. నగరపరిధిలోని హడ్కోకాలనీ మున్సిపల్ స్కూల్ వద్ద అదే కాలనీకి చెందిన అమ్మాయిలను రెల్లివీధికి చెందిన కొంతమంది కుర్రకారు ప్రతినిత్యం ఈవ్‌టీజింగ్ చేయడం జరుగుతుంది. ఈ విషయంపై పలుదఫాలుగా పోలీసులకు చెప్పినా పట్టించుకునే దాఖలాలు మాత్రం కనిపించలేదు. ఆదివారం మధ్యాహ్నం 3గంటల సమయంలో రెల్లివీధికి చెందిన ఓ వ్యక్తి పూటుగా మద్యం సేవించి హడ్కోకాలనీకి చెందిన ఓ అమ్మాయిపై అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీన్ని గమనించిన ఆకాలనీ యువత కలుగజేసుకుని వివరాలు తెలుసుకున్నారు. తమ కాలనీ అమ్మాయిలకు ర్యాగింగ్ చేయడం సరికాదంటూ సర్దిచెప్పి అక్కడ నుంచి పంపేశారు. సాయంత్రం మరో ఆరుగురు రెండు బైక్‌లపై వచ్చి కాలనీ వాసులతో మాటామాటా పెంచుకొని తగాదా పడి వెళ్లిపోయారు. ఈలోగా ఆర్.కె.నగర్‌కు చెందిన హేమసుందర్ అనే వ్యక్తి అటువైపుగా వస్తుండుగా రెల్లివీధికి చెందిన కొంతమంది వ్యక్తులు అడ్డగించి పిడుగుద్దలు గుద్దుతూ అక్కడ నుంచి పారిపోయారు. అప్పటికే జరిగిన సంఘటనపై కాలనీ వాసులు డైల్ 100కు, టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ కానిస్టేబుల్ వచ్చి సర్దిచెప్పినట్లు సమాచారం. అక్కడితో ఆగకుండా రాత్రి 7.30 సమయంలో రెల్లివీధికి చెందిన సుమారు 40 మంది ఆటోలు, బైక్‌లపై వచ్చి కాలనీలోని మహిళలు, యువత, చిన్నారులపై సైతం ఇష్టానుసారంగా కర్రలతో దాడిచేసినట్లు తెలిసింది. ఈ దాడిలో దుర్గా, కృష్ణ, బిందుసాగర్లకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. రోడ్డుపై బైఠాయింపు విషయం తీవ్రతరం కావడంతో కాలనీ వాసులంతా మాకుమ్మడిగా బలగ జంక్షన్ వద్ద రాస్తారాకో చేపట్టారు. రెండువైపులా బారికేడ్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను అడ్డుకున్నారు. తమకు న్యాయం జరిగేవరకూ ఆందోళన విరమించేదిలేదని హడ్కోకాలనీ వాసులంతా రోడ్డుపైనే సుమారు గంటవరకూ నినాదాలు తీశారు. పరిస్థితి కాస్తా ఉద్రిక్తతకు దారితీయడంతో విషయం తెలుసుకున్న రెండో పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సమీక్షించినా బాధితులెవ్వరూ వినిపించుకోలేదు. దీంతో సంఘటన స్థలంలోనే కాలనీకు చెందిన మహిళలు సీఐకు ఫిర్యాదు రాసి ఇచ్చారు. అనంతరం ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఆంబులెన్స్ ఆసుపత్రి ప్రధాన మార్గం గుండా వెళ్లే ఆంబులెన్స్ ట్రాఫిక్‌లో చిక్కుకుంది. ఓ పేషేంట్‌ను అత్యవసర విభాగానికి తరలిస్తుంది. ఎంత హరన్ కొట్టినా ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో కొంతమంది వ్యక్తులు కలుగుజేసుకుని ఆ అంబులెన్స్‌కు వేరే దారిగుండా ఆస్పత్రికి దారిచూపించారు. బాధితుడు కల్లేపల్లి బిందుసాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రవి, కూర్మా రావు, సత్తిబాబు, రాజు, నారాయణ, జ్యోతిలపై టూ టౌన్ సీఐ తిరుపతిరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మా కాలనీలో ఈవ్‌టీజింగ్ ఎక్కువ మా కాలనీలోని మున్సిపల్ స్కూల్ వద్ద ప్రతీనిత్యం ఈవ్‌టీజింగ్ జరుగుతుంది. స్కూల్ ఉన్నప్పుడైతే ఈ ప్రాంతంలో ఈవ్‌టీజింగ్ జరగడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం స్కూల్‌కి సెలవులైనప్పటికీ కాలనీకి చెందిన అమ్మాయిలపై రెల్లివీధికి చెందిన ఆకతాయిలు ఈవ్‌టీజింగ్ చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదులు చేసినా మాకు న్యాయం జరగలేదు. – బద్రినాథ్ (హడ్కోకాలనీ) మాకుమ్మడిగా దాడిచేశారు నాతో పాటు మా కాలనీ వాసులపై రెల్లివీధికి చెందిన కొంతమంది వ్యక్తులు మాకుమ్మడిగా దాడిచేశారు. ఓ అమ్మాయికి ఈవ్‌టీజింగ్ చేయడంతో నేను వెళ్లి వారికి అడిగాను. ఆ తగాదా సాయంత్రమే పెద్దల సమక్షంలో సద్గుమణింది. దాన్ని మనుసులో పెట్టుకుని ఆకతాయిలు మాపై కర్రలతో వెంటాడి కొట్టారు. కె.బిందుసాగర్ (హడ్కోకాలనీ) -
అమ్మాయిలకిది సేఫ్ సిటీ
'మీ సిటీలో మహిళల పట్ల చాలా మర్యాదగా వ్యవహరిస్తారు. ఈవ్‌టీజింగ్, అమ్మాయిల్ని అసభ్యంగా కామెంట్ చేయడం ఇక్కడ కనపడవు’ అంటూ ప్రశంసలు గుప్పించారు యువ ఫ్యాషన్ డిజైనర్ నిధి. ఢిల్లీకి చెందిన ఈమె నగరానికి వచ్చారు. బంజారాహిల్స్‌లోని అనహిత బొటిక్‌లో తన ఫెస్టివ్ అండ్ వెడ్డింగ్ తాజా కలెక్షన్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే.. నేను ఢిల్లీవాసినే అయినా హైదరాబాద్‌తో బాగా పరిచయం ఉంది. పన్నెండేళ్ల క్రితం నేను ఈ సిటీలోనే నిఫ్ట్‌లో డిజైనింగ్ కోర్సు చేశాను. అప్పుడు మాదాపూర్‌కి ఇప్పటి మాదాపూర్‌కి అసలు పోలికే లేదు. ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే ఆ రోడ్డు, వెదర్.. ఒహ్.. రియల్లీ బ్యూటీఫుల్. ఈ సిటీ గురించి ప్రధానంగా చెప్పుకోవాల్సిందేమిటంటే... ఇక్కడ ఈవ్‌టీజింగ్ చాలా తక్కువ. మా ఢిల్లీతో పోలిస్తే అసలు లేదనే చెప్పాలి. మహిళల పట్ల హైదరాబాదీలు చాలా మర్యాదగా వ్యవహరిస్తారు. అది నాకు చాలా నచ్చిన అంశం. అందుకే అమ్మాయిలకి ఇది సేఫ్‌సిటీ. ఇక్కడి వారికి ఫ్యాషన్ స్పృహ ఎక్కువే. కలర్స్, ట్రెడిషనల్ వర్క్, హ్యాండ్లూమ్స్ను బాగా లైక్ చేస్తారిక్కడ. ఐదారేళ్లుగా మా లేబుల్‌కు ఈ సిటీలో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. ‘పేకాట’ ఫ్యాషన్... ఈసారి ఢిల్లీ విల్స్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్ వీక్‌లో ప్రదర్శించిన కలెక్షన్స్‌ను ఇక్కడికి తీసుకొచ్చాను. పరిణీతిచోప్రా, ఆలియాభట్, అదితిరావ్ వంటి బాలీవుడ్ సెలబ్రిటీలు ధరించి వాక్ చేసిన డిజైన్లు ఇందులో ఉన్నాయి. ప్లేయింగ్కార్డ్స్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని రూపొందించిన ‘హౌస్ ఆఫ్ కార్డ్స్’, క్వీన్ ఆఫ్ హార్ట్స్ వంటి డిజైన్లను ఫ్యాషన్ లవర్స్ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ర్యాంప్లుక్స్ని కోరుకునే వారికి స్పెషల్ ఇవి. - ఎస్బీ -
ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే ఇక జైలే
షీ టీంకు దొరికిన ఖదీర్‌కు రెండు రోజుల జైలు శిక్ష సాక్షి, హైదరాబాద్: ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన నిందితులను పీటీ కేసు కింద నమోదు చేయడంతో పోలీసు స్టేషన్లోనే బెయిల్‌పై విడుదలయ్యేవారు. ఇక నుంచి అలా కాకుండా ఏకంగా జైలు శిక్షే పడేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. తొలి రోజే నాంపల్లి కోర్టు ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన ఓ నిందితుడికి రెండు రోజుల జైలు శిక్ష కూడా విధించింది. మంగళవారం మల క్‌పేట బస్‌స్టాప్‌లో ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతూ పతేషానగర్కు చెందిన ఎండీ అబ్దుల్ ఖదీర్ ఖురేషీ(37) సీసీఎస్ పోలీసు(షీటీమ్)లకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అతనిపై సిటీ పోలీసు యాక్ట్ 70 సీ కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని బుధవారం నాంపల్లిలోని ఏడవ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. మెజిస్ట్రేట్ కేసు వివరాలను పరిశీలించి ఖదీర్‌కు ఎనిమిది రోజుల జైలు శిక్ష విధించా రు. తనపై ఆధారపడిన భార్య, కూతురు ఇబ్బందులకు గురవుతారని ఖదీర్ మెజిస్ట్రేట్‌ను అభ్యర్ధించి, సారీ చెప్పాడు. దీంతో శిక్షను రెండు రోజులుగా మార్చి తీర్పునిచ్చారు. ఖదీర్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. మహిళ భద్రతపై దృష్టి.... ఇప్పటివరకు నిందితులు స్టేషన్ స్థాయిలోనే చలానా చెల్లించడంతో కేసు మూసివేసేవారు. దీంతో ఈవ్‌టీజర్లలో మార్పు రాదని తలంచిన నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి నిందితులను కోర్టులో హాజరుపర్చేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా నగర మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి రజనికి ఇటీవల లేఖ రాసారు. దీన్ని పరిశీలించిన జడ్జి.. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడే వారిని కోర్టులో హాజరుపర్చి జైలు శిక్ష కూడా విధించాలంటూ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్లను ఆదేశించారు. ఇది బుధవారం నుంచే మొదలైంది. ఇక నుంచి పట్టుబడితే ఎనిమిది రోజుల వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. -
శివసైనికుడి దారుణ హత్య
సాక్షి, ముంబై: మలాడ్‌లోని డోంగ్రీ పరిసరాల్లో మంగళవారం రాత్రి శివసేన గట్ ప్రముఖుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల కథనం ప్రకారం డోంగ్రీ ప్రాంతానికి చెందిన మహిళను ఈవ్‌టిజింగ్ చేసిన కొందరు ఆకతాయిలను నిలదీసేందుకు గట్ ప్రముఖుడు రమేశ్ జాదవ్ సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో వెళ్లాడు. అక్కడ ఆ యువకులు, జాదవ్ మధ్య వాగ్వాదం జరిగింది. కాగా, రాత్రి 10.30 గంటల ప్రాంతంలో సదరు యువకులు జాదవ్ ఇంటికి వచ్చి మళ్లీ గొడవ పడి పదునైన కత్తులతో దాడిచేయడంవల్ల ఆయన అక్కడే మరణించారు. ఈ విషయం తెలుసుకున్న వందలాది శివసైనికులు స్థానిక దిండోషి పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. బీజేపీ ఎంపీ గోపాల్ శెట్టి, శివసేన ఎమ్మెల్యే సునీల్ ప్రభు తదితరులు సైతం అక్కడికి వచ్చి హంతకులను వెంటనే అరెస్టు చేయాలంటూ ఆందోళనకు దిగారు. పరిస్థితులు అదుపుతప్పక ముందే నగర పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా అక్కడికి చేరుకుని హంతకులను పట్టుకుంటామని సర్దిజెప్పడంతో ఆందోళనకారులు వెనుదిరిగారు. రంగంలోకి దిగిన పోలీసులు బుధవారం మధ్యాహ్నం ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా బుధవారం స్థానిక వ్యాపారులు బంద్ నిర్వహించారు.