భార్యను వేధించిన కేసులో మాజీ డీఎస్పీ అరెస్ట్
అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యను వేధింపులకు గురి చేయడమే కాకుండా మరో మహిళతో వివాహేత సంబంధం కొనసాగిస్తున్న మాజీ డీఎస్పీ వెంకటేశ్వరరావును విజయవాడ నగర పోలీసులు శనివారం రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని పటమట పోలీసు స్టేషన్కు తరలించారు. తనను నిర్లక్ష్యం చేయడమే కాకుండా నిత్యం వేధింపులకు పాల్పడుతున్నాడని ఆయన భార్య నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో వెంకటేశ్వరరావుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా డీఎస్పీ వేంకటేశ్వరరావును నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గతంలో వెంకటేశ్వరరావు కరీంనగర్ పోలీసు బెటాలియన్లో డీఎస్పీగా విధులు నిర్వర్తించేవారు. ఆ సమయంలో తన భర్త వెంకటేశ్వరరావు తనపై నిత్యం వరకట్న వేధింపులకు పాల్పడుతున్నాడని ఆయన భార్య గతంలో పోలీసు ఉన్నతాధికారులను ఫిర్యాదు చేసింది. దాంతో వెంకటేశ్వరరావుపై పోలీసు ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.