మాజీ సైనికులకు ఉద్యోగ అవకాశాలు
హన్మకొండ : లోక్సభ సెక్రటేరియట్లో సెక్యూరిటీ అసిస్టెంట్ గ్రేడ్–2 ఉద్యోగాలకు మాజీ సైనికుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారిణి వనజ తెలిపారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, గణితంతో 10 ప్లస్ 2 ఉత్తీర్ణులైన వారు లేదా కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లమో పొంది న వారు దరఖాస్తులకు అర్హులని పేర్కొన్నారు. సెప్టెంబర్ 5వ తేదీ నాటికి 45 ఏళ్లు నిండి ఉండాలని తెలిపారు. దరఖాస్తులను సెప్టెంబర్ 5వ తేదీ లోగా ‘ది జాయింట్ రిక్రూట్మెంట్ సెల్, రూం నెంబర్ 521, పార్లమెంట్ హౌజ్ అన్నేక్స్, న్యూ ఢిల్లీ–110001’ చిరునామాకు దరఖాస్తులు పంపాలని కోరారు.