తీవ్ర ఒడిదుడుకుల మధ్య ముగిసిన మార్కెట్లు
ముంబై: ఫ్లాట్ గా ప్రారంభమైన మార్కెట్లు రోజంతా తీవ్ర ఊగిసలాటల మధ్య కదలాడాయి. చివరికి భారీ ఒడిదుడుకుల మధ్య సెన్సెక్స్ 59 పాయింట్ల నష్టంతో 28,005 దగ్గర, నిఫ్టీ 18 పాయింట్ల నష్టంతో 8,624 వద్ద ముగిశాయి. స్వల్ప నష్టాలతో మొదలైన మార్కెట్లు వెంటనే నామమాత్ర లాభాల్లోకి అనంతరం 100 పాయింట్లకు పైగా లాభపడింది. కానీ ముగింపులో అమ్మకాల ఒత్తిడితో సూచీలన్నీ నష్టాల బాటపట్టాయి. మెటల్స్, ఆటో రంగాలు టాప్ లో ఉండగా ఐటీ రంగంలో వరుసగా మూడో రోజు కూడా అమ్మకాల జోరు కొనసాగింది. పవర్ సెక్టార్ అమ్మకాలు వెల్లువెత్తాయి. నిఫ్టీ దిగ్గజాలలో హీరోమోటో, యాక్సిస్, భారతీ, గ్రాసిమ్, టాటా స్టీల్ లాభపడగా, టీసీఎస్ సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, సిప్లా, కొటక్ బ్యాంక్ క్షీణించాయి.
అయితే 8300 -8400 లెవల్స్ కు కరెక్షన్ వచ్చే అవకాశం ఉందని, అయితే ఇన్వెస్టర్లు నిఫ్టీలో అమ్మకాల వైపు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని మార్కెట్ నిపుణుడు జై బాలా సూచించారు.
అటు ఎంసీఎక్స్ మార్కెట్ లో పుత్తడి బలహీనంగా ఉంది. పది గ్రాముల పసిడి రూ. 132 ల నష్టంతో 31,335 వద్ద ఉంది.