పలు రైళ్లలో అదనపు బెర్తులు
సాక్షి,హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో డిసెంబర్ 31 నుంచి జనవరి మొదటివారం వరకు అదనపు బెర్తులు ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, ఏసీ చైర్ కార్, స్లీపర్ క్లాస్‌లలో ఈ బోగీలను ఏర్పాటు చేస్తారు. సికింద్రాబాద్-విశాఖ దురంతో ఎక్స్‌ప్రెస్, తిరుపతి-కొల్హాపూర్ హరిప్రియ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-యశ్వంత్‌పూర్ గరీబ్థ్,్ర గుంటూరు-వికారాబాద్ పల్నాడు ఎక్స్‌ప్రెస్, నాందేడ్-ముంబై సీఎస్టీ తపోవన్ ఎక్స్‌ప్రెస్, ధర్మాబాద్-మన్మాడ్ డెయిలీ ఎక్స్‌ప్రెస్‌లలో అదనపు బోగీలు అందుబాటులోకి రానున్నాయి.