పరిశ్రమల స్థాపనకు బ్యాంకులు రుణాలివ్వాలి
కాకినాడ రూరల్ :
జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు వారికి బ్యాంకులు రుణాలు అందజేయాలని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సురేష్‌బాబు అన్నారు. ఏపీ పొల్యూషన్ బోర్డు కేంద్ర కార్యాలయంలో బ్యాంకు అధికారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎన్నికై రుణాల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులతో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యూనిట్ బాగోకపోతే వాటిని మార్చి వేరే యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి సహకరించాలే తప్ప రుణం ఇవ్వకపోవడం సరికాదని సురేష్ బాబు అన్నారు. బ్యాంకర్లు కొత్త రుణాలు ఇవ్వాలని, లేకపోతే ఎందుకు రుణాలను తిరస్కరిస్తున్నారనే సమాచారం అందజేయాలని స్పష్టం చేశారు. జిల్లాలోని 63 మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, నేబ్కాన్ మేనేజర్ కె.కృష్ణమోహన్, నాబార్డు ఏజీఎం కేవీఎస్ ప్రసాద్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఏబీ పటేల్, ఇండస్ట్రియల్ టీమ్ హెడ్ కె.శ్రీహరి, వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.