Fake employee
-
తెలంగాణ సచివాలయంలో మరో నకిలీ ఉద్యోగి
సాక్షి, హైదరాబాద్: గత కొన్ని రోజులుగా తెలంగాణ సచివాలయంలో నకిలీ ఉద్యోగులు కలకలం రేపుతున్నారు. ఇవాళ మరో నకిలీ ఉద్యోగిని సచివాలయ భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. ఫేక్ ఐడీ కార్డులతో సచివాలయంలోకి ప్రవేశించిన నకిలీ ఉద్యోగిని గుర్తించిన భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. తహశీల్దార్ పేరుతో కొంపల్లి అంజయ్య సచివాలయంలోకి వెళ్లాడు. అయితే అతనిపై అనుమానం రావడంతో అధికారులు విచారించి.. ఫేక్ ఐడీ కార్డుతో వచ్చాడని గుర్తించారు. సైఫాబాద్ పోలీసులకు అంజయ్యను అప్పగించారు.కాగా, కేటుగాళ్లు.. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో కొత్త అవతాలు ఎత్తుతున్నారు. గత వారం.. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన విజయవంతంగా ముగించుకుని వచ్చిన నేపథ్యంలో తెలంగాణ సెక్రటరియేట్లో ప్రెస్మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్మీట్ సందర్భంగా ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ యూసుఫ్, హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు తనిఖీలు నిర్వహించారు.తనిఖీ చేసే సమయంలో తాను రెవెన్యూ శాఖ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగినంటూ ఖమ్మంకు చెందిన భాస్కర్ రావు హాజరయ్యాడు. భాస్కర్ రావు ఐడీపై అనుమానం రావడంతో పోలీసులు తమదైన శైలీలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చిన సంతి తెలిసిందే. భాస్కర్ ప్రభుత్వ ఉద్యోగి కాదని, మైనార్టీ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ వి.ప్రశాంత్ డ్రైవర్ రవి.. భాస్కర్ రావుకు ఫేక్ ఐడి కార్డు తయారు చేయించినట్టు గుర్తించారు. డ్రైవర్ రవిని కూడా ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
తెలంగాణ సెక్రటరియేట్లో నకిలీ ఉద్యోగి దొరికాడిలా!
సాక్షి,హైదరాబాద్ : కేటుగాళ్లు.. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో కొత్త అవతాలు ఎత్తుతున్నారు. తాజాగా, తెలంగాణ సెక్రటరియేట్లో కేటుగాళ్లు..‘మేం తెలంగాణ సెక్రటరియేట్ ఉద్యోగులం మీకు ఏమైనా పని కావాలంటే చెప్పండి. చిటికెలో చేసి పెడతాం. కాకపోతే దానికి కొంత ఖర్చవుతుంది’ అంటూ పలువురి దగ్గర భారీ వసూళ్ల పాల్పడ్డారు. చివరికి ఎత్తుగడ ఫలించక దొరికిపోయారు. ఇంతకీ ఆ ఫేక్ ఉద్యోగి ఎవరు? ఆ ఫేక్ ఉద్యోగికి సహకరించింది ఎవరు? వాళ్లని పోలీసులు ఎలా పట్టుకున్నారు? రెండ్రోజుల కిందట సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన విజయవంతంగా ముగించుకుని వచ్చిన నేపథ్యంలో తెలంగాణ సెక్రటరియేట్లో ప్రెస్మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్మీట్ సందర్భంగా ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ యూసుఫ్, హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీ చేసే సమయంలో తాను రెవెన్యూ శాఖ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగినంటూ ఖమ్మంకు చెందిన భాస్కర్ రావు హాజరయ్యాడు. భాస్కర్ రావు ఐడీపై అనుమానం రావడంతో పోలీసులు తమదైన శైలీలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.భాస్కర్ ప్రభుత్వ ఉద్యోగి కాదని, మైనార్టీ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ వి.ప్రశాంత్ డ్రైవర్ రవి.. భాస్కర్ రావుకు ఫేక్ ఐడి కార్డు తయారు చేయించినట్టు గుర్తించారు. డ్రైవర్ రవిని కూడా ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.ఫేక్ ఐడీ కార్డు వ్యవహారంలో.. ఏ1గా భాస్కర్ రావు, ఏ2గా డ్రైవర్ రవిలపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో భాస్కర్రావు, రవిలు సచివాలయంలో కీలక మంత్రుల పేర్లు చెప్పి పనులు చేయిస్తామని డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. ఈ ఫేక్ ఐడీ వ్యవహారంలో ఇంకెవరి హస్తం ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. -
తెలంగాణ సచివాలయంలో నకిలీ ఉద్యోగి కలకలం
-
టీటీడీలో నకిలీ ఉద్యోగి హల్చల్
తిరుమల: కలియుగ దేవుడు శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో ఓ నకిలీ ఉద్యోగి విద్యుత్ శాఖ ఏఈ అంటూ హల్చల్ చేశాడు. శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించిన కుమార్ అనే వ్యక్తి తాను విద్యుత్ శాఖ ఏఈగా చెప్పుకుంటూ అలజడి సృష్టించాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు టీటీడీ పోలీసు అధికారులు పేర్కొన్నారు. అయితే గత మూడు నెలలుగా ఆలయంలో కుమార్ ఏఈగా చెప్పుకుంటూ తిరుగుతున్నట్టు పోలీసులు తెలిపారు. అతనిపై అనుమానంతో విజిలెన్స్ అధికారులు కూడా విచారిస్తున్నట్టు సమాచారం.