అధికారుల తీరుపై రైతుల ఆందోళన
దహెగాం : ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా రైతులకు పూర్తి స్థాయిలో పంట రుణాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తున్న అధికారుల తీరుపై సోమవారం రైతులు బ్యాంకు ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రైతుల ఆందోళనకు నాయకులు పోతుగంటి భీమన్న, పుప్పాల సంతోష్ మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఖరీఫ్ పనులు ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా మాకు పంటరుణాలు సకాలంలో అందడం లేదని వాపోయారు.
కొన్ని రోజులుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం రైతులు బ్యాంకుకు రావాలని అధికారులు తెలిపితేనే బ్యాంకు వచ్చామని కానీ బ్యాంకుకు వచ్చిన తరువాత తలుపులు వేసి లోనికి రానివ్వలేదని వాపోయారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకు ఎదుట నిరసన తెలపడంతో అధికారులు బ్యాంకు తలుపులు తీశారు. రైతులు తిరుపతి, గంగారాం వివిధ గ్రామాల రైతులు ఉన్నారు.