పెయింటర్ ఆత్మహత్య
మర్రిపాలెంః కుటుంబ కలహాలతో ఓ పెయింటర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరిపోసుకుని ప్రాణాలు బలి తీసుకున్నాడు. కంచరపాలెం పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం కప్పరాడ ప్రాంతం మాణిక్యాంబ కాలనీలో పొట్నూరు వినోద్(25) కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. భార్య లావణ్య, ఇద్దరు కుమారులు సంతానంగా ఉన్నారు. కొద్ది రోజులుగా వినోద్ కుటుంబంలో కలహాలు ఉన్నాయి. దీంతో మనస్తాపం చెందిన వినోద్ మంగళవారం ఫ్యాన్ హుక్కు ఉరిపోసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు కంచరపాలెం పోలీసులకు సమాచారం అందించారు. ఎసై ్స సోమేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని మతదేహం పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు చేశారు.