తలైవా అభిమానుల అసంతృప్తి
సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా వస్తోందంటే అభిమానులకు పండుగే. రజనీ సినిమాలు ఫెయిల్ అయినా సరే ఈ సూపర్‌స్టార్ క్రేజ్ ఏ మాత్రం చెక్కుచెదరదు. గత కొంతకాలంగా తలైవాకు సరైన హిట్ లేదు. కొచ్చాడియన్, లింగా, కబాలి సినిమాలు ఆశించనంతగా ఆడలేదు. అయినా సరే మళ్లీ రజనీ సినిమా వస్తుందంటే అభిమానలు వేయి కళ్లతో ఎదురు చూస్తూంటారు. ప్రస్తుతం కాలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
కబాలి ఫేం పా రంజిత్ డైరెక్షన్లో రాబోతున్న కాలా చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. కబాలి విడుదల సమయంలో చేసిన ప్రమోషన్ కార్యక్రమాలు బహుశా ఏ ఇతర భారతీయ సినిమాలకు చేసి ఉండరు. ఏకంగా విమానాలపై కబాలి పోస్టర్స్‌ను వేశారు. కొన్ని ప్రైవేట్ సంస్థలు కబాలి రిలీజ్ రోజున సెలవు కూడా ప్రకటించాయి. ఇప్పుడు కాలా సినిమాకు ట్విటర్ ఎమోజీని క్రియేట్ చేశారు చిత్రయూనిట్. అయితే దీనిపై తలైవా అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. ఆ ఎమోజీలో రజనీ సరిగా కనబడటం లేదని అభిమానులు వాపోతున్నారు. మరికొందరు కొన్ని నమూనాలను డిజైన్ చేసి చిత్రయూనిట్‌కు ట్యాగ్ చేశారు. మరి వీరి బాధను కాలా టీం పట్టించుకుంటుందో లేదో చూడాలి.
#Kaala emoji. All i see is a think red line with a black background. Wish they chose a different pic or worked on the resolution.
— Prashanth Rangaswamy (@itisprashanth) May 28, 2018
Actually, i expected an Emoji of something like this from the team #Kaala , what they delivered is hardly visible
Made some quick images, please take my samples into consideration, @wunderbarfilms @dhanushkraja @beemji or ask designer to comeup something visible to eyes! pic.twitter.com/zNBhQXzPfx
— AG (@arunrp555) May 28, 2018