fare cabs
-
ప్రయాణికులకు భారీ షాక్, పెరిగిన క్యాబ్ ఛార్జీలు!
ప్రయాణికుల జేబుకు చిల్లు పెట్టేందుకు రైడ్ షేరింగ్ సంస్థ సిద్ధమైంది. ఉబెర్ కార్ సర్వీస్ ఛార్జీల ధరల్ని పెంచుతున్నట్లు ఉబర్ ఇండియా సెంట్రల్ ఆపరేషన్ డైర్టకర్ నితీష్ భూషణ్ బ్లాగ్‌లో తెలిపారు. "పెరుగుతున్న ఇంధన ధరలు అందరిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ఇబ్బందులు పడుతున్నట్లు ఉబర్ డ్రైవర్లు కౌన్సిల్ సభ్యులకు చెప్పినట్లు తెలిపారు. సంస్థ కోసం కష్టపడుతున్న డ్రైవర్ల ఆచరణీయమైన, ఆకర్షణీయంగా ఉండేందుకు కృషి చేస్తాం. అందుకే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు భూషణ్ బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. కొత్త ఫీచర్లను యాడ్ చేసింది రైడ్ క్యాన్సిలేషన్ అనేది ప్రయాణికుల్లో ప్రధాన సమస్య. అందుకే డ్రైవర్లు ప్రయాణికుల రైడ్‌ను అంగీకరించేందుకు వాళ్లు ఎక్కడ ఉన్నారనే విషయాల్ని చూపించేలా ఉబెర్ కొత్త ఫీచర్‌ను యాడ్ చేసింది అని ఉబెర్ పేర్కొంది. సీపీపీఏ వార్నింగ్‌తో ఇటీవల సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అధారిటీ (సీపీపీఏ) రైడ్ షేరింగ్ సంస్థలకు హెచ్చరికలు జారీ చేసింది. రైడ్ క్యాన్సిలేషన్, క్యాన్సిలేషన్ ఛార్జీలు,ర్యాండమ్‌గా పెరుగుతున్న ధర, ప్రయాణికులు క్యాబ్ కోసం ఎదురు చూడటం, డ్రైవర్లు ట్రిప్పులను రద్దు చేయమని ప్రయాణికుల్ని ఇబ్బంది పెట్టడం' వంటి ప్రయాణికులకు తలెత్తున్న సమస్యల్ని పరిష్కరించాలని హెచ్చరించింది. అదే సమయంలో క్యాబ్ అగ్రిగేటర్లను రైడ్ క్యాన్సిలేషన్లు, డీ ఫాల్ట్‌గా (యాధృచ్చికంగా) పెరుగుతున్న ఛార్జీలకు సంబంధించిన అల్గారిథమ్‌ల మార్చాలని తెలిపింది. కస్టమర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ఉబెర్, ఓలాతో సహా ఇతర రైడ్ షేరింగ్‌లకు సంబంధించిన అల్గారింథమ్లను మార్చేందుకు 30రోజుల సమయం ఇచ్చింది. -
రూ.4 వేలతో వారం రోజులు...
బెంగళూరు: సొంతంగా ఓ కారు ఉండాలని, అందులో షికారుకెళ్లాలని చాలా మందికి కోరిక ఉంటుంది. ఆర్థిక స్థోమత కారణంగా అందరికీ ఇది సాధ్యంకాకపోవచ్చు. కాస్త తక్కువ బడ్జెట్ లోనే కారులో విహారయాత్రకు వెళ్లాలనుకునేవారికో శుభవార్త. 4 వేల రూపాయలతో వారం రోజులపాటు కారును అద్దెకు ఇచ్చి ఎంచక్కా ఎంజాయ్ చేయమంటున్నారు జస్ట్రైడ్ సంస్థ వాళ్లు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ కారును వాడుకోవచ్చు. ‘ఉబిక్’ అనే పేరుతో దీనిని 2015 ఆగస్టులో బెంగళూరులో ప్రారంభించారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు, సొంతంగా కారు కొనుక్కునే స్థోమత లేని వారు ఈ అద్దె కార్లను వినియోగించుకోవచ్చు. ఈ సంస్థ 125 కార్లతో 60 వేలకు పైగా కస్టమర్లతో కళకళలాడుతోంది. నగరంలో 10 చోట్ల సంస్థ ఆఫీసులున్నాయి. ఇవికాక దేశవ్యాప్తంగా ముంబై, పుణె, ఢిల్లీలలో వీటికి బ్రాంచ్‌లున్నాయి. కారును అద్దెకు తీసుకునే ముందు రూ.999 ని డిపాజిట్ చేయాలి. కారును తిరిగి ఇచ్చేటప్పుడు ఈ మొత్తాన్ని రీఫండ్ చేస్తారు. ప్రధానంగా సెల్ఫ్డైవ్ కే ప్రాధాన్యం ఇస్తామని సంస్థ నిర్వాహకులు చెప్పారు. కస్టమర్లు ప్రతివారం తమకిష్టమైన కార్లను తీసుకెళ్లే సౌకర్యాన్ని కల్పించారు. హోం డెలివరీ, అన్లిమిటెడ్ కిలోమీటర్ల ఆప్షన్స్ వంటివి ప్రవేశపెట్టారు. ఇవేకాక కార్లలో ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం(ఏబీఎస్) వంటి సౌకర్యాలున్నాయి. ఇక నమ్మకస్తులైన కస్టమర్లకయితే డిపాజిట్ లేకుండా కార్లను అద్దెకు ఇస్తున్నారు. వివిధ రకాల రేట్లతో కార్లు అందుబాటులో ఉంటాయి. సంస్థ వెబ్సైట్ https://justride.in/ ద్వారా కార్లను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు.