గాయని జానకికి ‘భారత రత్న’ ఇవ్వాలి
ప్రొద్దుటూరు కల్చరల్: దక్షిణ భారత దేశంలో తిరుగులేని గాయని అయిన ఎస్.జానకికి భారతరత్న అవార్డు ఇవ్వాలని జానకి అభిమాన బృందం అధ్యక్షుడు గోపాల కృష్ణ కోరారు. శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ ఎన్నో భాషల్లో పాటలు పాడి ఆమె ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. మధుర గీతాలు ఆలపించి ప్రజల మనసులను గెలుచుకున్నారని పేర్కొన్నారు. సమావేశంలో జేవీవీ నాయకుడు చంద్రశేఖర్‌రావు, గాయకులు మునెయ్య, గిరి, వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.