ఫార్మసీ రంగానికి ఎంతో ప్రాధాన్యం ఉంది
దివాన్‌చెరువు (రాజానగరం) :
ఫార్మసీ రంగానికి ఎంతో ప్రాధాన్యం ఉందని, ఈ కోర్సు చేసిన వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ఆదిత్య డిగ్రీ కళాశాల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి అన్నారు. దివాన్‌చెరువులోని వీజేస్ ఫార్మసీ కళాశాలలో బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ మొదటి సంవత్సరం తరగతుల ప్రారంభం సందర్భంగా విద్యార్థులతో శుక్రవారం నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఫార్మసీ రంగంలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని ఫార్మసీ కౌన్సిల్ సభ్యులు డీఎన్ఆర్ ప్రసాద్‌రెడ్డి అన్నారు. దేశంలోని 30 శాతం పరిశ్రమలు హైదరాబాద్, విశాఖపట్నంలోనే ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ కేఎన్ విద్యాధర్, కరస్పాండెంట్ జగన్మోహన్రెడ్డి, వైస్ ప్రిన్పిపాల్ డాక్టర్ డి. నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు.