మార్కెట్కు రెండు వైపులా ఆత్మాహుతి దాడులు
అబుజా: బోకోహారమ్ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడుల్లో 30 మందికి పైగా మృతి చెందిన ఘటన ఈశాన్య నైజీరియాలో చోటుచేసుకుంది. మదగలి ప్రాంతంలోని రద్దీగా ఉన్న మార్కెట్ వద్ద ఇద్దరు మహిళా ఉగ్రవాదులు శుక్రవారం ఆత్మాహుతి దాడి చేశారు.
మార్కెట్కు రెండు వైపులా ఇద్దరు మహిళలు తమను తాము శక్తివంతమైన బాంబులతో పేల్చేసుకున్నారని స్థానిక ప్రభుత్వ చైర్మన్ యూసుఫ్ మహ్మద్ వెల్లడించారు. ఈ ఘటనలో మరికొంత మంది తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. బోకోహారమ్ ఉగ్రవాదులు వందలాది మందిని కిడ్నాప్ చేసి ప్రజలను మానవబాంబులుగా వాడుతున్నారని అధికారులు వెల్లడించారు.