తెలుగు రాష్ట్రాల్లో రైల్వే హెల్ప్ లైన్ నెంబర్లు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దక్షిణ మధ్య రైల్వే కొన్ని రైళ్లను రద్దు చేయగా మరికొన్ని రైళ్లను ఎక్కడికక్కడే నిలిపివేశారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల సమీపంలో రైల్వే ట్రాక్ పూర్తిగా దెబ్బతింది. దీంతో రైళ్లను వెనక్కి పంపించారు. రైలులోని ప్రయాణికులు బస్సుల ద్వారా వెళ్లాలని అధికారులు సూచించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. (చదవండి : భారీ వర్షాలు.. పలు రైళ్లు రద్దు)
రైల్వే స్టేషన్ హెల్ప్ లైన్ నంబర్లు
సికింద్రాబాద్ : 040 27700868, 27786170
విజయవాడ : 0866 2575038
మిర్యాలగూడ : 70939 98715
గుంటూరు : 97013 79072, 0863 2222014
గుంటూరు కంట్రోల్ నంబర్ : 97013 79073, 1072.