జూరాల.. ఎన్నాళ్లిలా...?
184 గ్రామాల తాగునీటి పథకానికి లీకేజీల గ్రహణం
గద్వాల: గద్వాల రెవెన్యూ డివిజన్లోని సుమారు 184 గ్రామాలకు తాగునీటిని అందించాలన్న లక్ష్యంతో చేపట్టిన జూరాల భారీ తాగునీటి పథకం లీకేజీలమయంగా మారింది. అస్తవ్యస్తంగా పనులు చేపట్టడంతో ఫైబర్ పైపులు పగిలిపోయి ఏ గ్రామానికీ తాగునీటిని అందించలేకపోయారు. రూ.110కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పథకం పైపులైన్లు లీకేజీలకు గురికావడంతో ప్రభుత్వం నాలుగునెలల క్రితం బాధ్యులను తేల్చేందుకు విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు ఫైబర్ పైప్లైన్ల పగుళ్ల తీరు, ఎవరు కారణం, లోపాలు ఏమిటనే కోణంలో విచారించి వాస్తవాలను తేల్చాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి బాధ్యతలు అప్పగించారు.
నాలుగు నెలలుగా విచారణ సాగుతున్నా బాధ్యులు ఎవరనే విషయాన్ని తేల్చలేకపోతున్నారు. లీకేజీల కారణాలు, డిజైన్ రూపకల్పన, ఫైబర్ పైపుల అనుమతి, నీటిఒత్తిడిని అంచనా వేయకుండా అనుమతించడం వంటి అంశాలపై విచారణలో తేలాల్సి ఉంది. ఇదిలాఉండగా, జూరాల భారీతాగునీటి పథకం ఫిల్టర్ బె డ్స్, కొండగట్టుపై నిర్మించిన భారీ భాం డాగారాన్ని వాటర్‌గ్రిడ్‌లో చేర్చారు.
లీకేజీల మయం.. నిర్వహణలోపం
2006లో భారీ తాగునీటి పథకానికి శం కుస్థాపన చేశారు. మొదటిదశలో ఈ తా గునీటి పథకం నిర్వహణకు హడ్కోద్వా రా రూ.30కోట్లు కేటాయించారు. త దనంతరం మిగతా పనులను పూర్తి చేసేం దుకు అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అ నుమతితో నిధులు కేటాయిం చారు. 2012 ఆగస్టు నాటికి జూరాల భారీ తా గునీటి పథకం, ఫిల్టర్‌బెడ్స్, పంపింగ్ స్టేషన్, కొండగట్టుపై గ్రావిటీ వాటర్ ట్యాంకు నిర్మాణాలు పూర్తిచేశారు.
అదే ఏడాది పథకాన్ని ప్రారంభించే సమయంలో ఫిల్టర్‌బెడ్స్ నుంచి కొండగట్టుపై ఉన్న వాటర్‌ట్యాంకు వరకు నీటిని సరఫరా చేసే నాలుగున్నర కిలోమీటర్ల మేర ప్రధాన పైప్‌లైన్‌కు లీకేజీలు ఏర్పడ్డాయి. దాదాపు 60చోట్లకు పైగా లీకేజీలు ఏర్పడటంతో విసిగిపోయిన ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు ఫైబర్‌పైపుల స్థానంలో డీఐ పైపులను వేయాల్సిందిగా అనుమతించారు.
ఏడాది క్రితం డీఐ పైపులను కొండగ ట్టు వరకు వేసి ట్రయల్న్ ్రనిర్వహించి విజయవంతమయ్యారు. కొండగట్టుపై ఉన్న రిజర్వాయర్ నుంచి గ్రావిటీఫ్లో ద్వారా డివిజన్ పరిధిలోని 184 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేయడంలో భాగంగా మొదటిదశలో 31 గ్రామాలకు ట్రయల్న్ ్రప్రారంభించారు. ఆదిలోనే లీకేజీలు ఏర్పడటంతో ఒక్క గ్రామానికి కూడా నీళ్లివ్వలేని పరిస్థితి నెలకొంది.
ఓ చోట మరమ్మతులు చేసి ట్రయల్న్ ్రప్రారంభిస్తే మరోచోట లీకేజీలు ఏర్పడ్డా యి. దీంతో ఫైబర్ పైపుల స్థానంలో డీ ఐ పైపులను వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం వాటర్‌గ్రిడ్ పథకంలో జూరాల భారీ తాగునీటి పథకాన్ని చేర్చారు. నాసిరకం పనులు, లీకేజీలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుని తాగునీటిని సరఫరా చేయాలని ఈ ప్రాంతప్రజలు కోరుతున్నారు.