ఫిదాహుసేన్ మృతికి సంతాపం
అనంతపురం న్యూటౌన్ : ఏపీ ఎన్జీవో సంఘం మాజీ నాయకులు ఫిదా హుసేన్ మరణం ఉద్యోగ రంగానికి తీరని లోటని ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకులు తమ సంతాపం ప్రకటించారు. ఎన్జీవో సంఘంలో, పదవీ విరమణ అనంతరం పెన్షనర్స్ సంఘంలో వివిధ హోదాలలో పనిచేసిన ఫిదాహుస్సేన్ మంగళవారం ఆకస్మికంగా మరణించారు.
ఉదయం ఆయన భౌతిక కాయాన్ని సందర్శించిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, మైనార్టీ సంఘాల నాయకులు ఆయన ఆత్మశాంతి కోసం కాసేపు మౌనం పాటించారు. ఫిదాహుసేన్ కుటుంబానికి ఆత్మసై్థర్యం కల్గించాలని తమ సంతాపంలో తెలియజేశారు.