Fighting dominance
-
కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: పార్టీ బలోపేతం పేరుతో ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు, ము గ్గురు నాయకులను పార్టీ సీనియర్లు ప్రోత్సహిస్తుండడం పరోక్షంగా కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలకు ఆజ్యం పోసినట్లవుతోంది. నియోజకవర్గానికి ఓ ఇన్చార్జి కొనసాగుతున్నప్పటికీ.. మరో వ్యక్తిని తెరపైకి తేవడం స్థానికంగా ఆధిపత్య పోరుకు దారి తీస్తోంది. ఉమ్మడి జిల్లా పరిధిలో పలు నియోజకవర్గాలో ఈ పరిస్థితి నెలకొంది. ఇలా కొత్త నేతలను తెరపైకి తెస్తున్న ఒకరిద్దరు సీనియర్ నేతలు ఆయా నియోజకవర్గాల్లో తలెత్తుతున్న సమన్వయ లోపాన్ని కావాలనే సరిదిద్దడం లేదనే విమర్శలు గుప్పుమంటున్నాయి. దీంతో పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి. బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీగా కాసుల బాల్‌రాజ్ కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో ఆయన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిపై పోటీ చేశారు. ఇక్కడ కొత్తగా మరోనేత మల్యాద్రిరెడ్డిని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు తెరపైకి తేవడంతో స్థానికంగా గ్రూపు తగాదాలకు దారితీసినట్లయింది. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు గట్టి నాయకత్వం అవసరం కాగా, ఉన్న కాస్త క్యాడర్ గ్రూపులుగా విడిపోవడంతో పార్టీకి నష్టం వాటిల్లుతోంది. ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో నల్లమడుగు సురేందర్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కాగా ఇక్కడ జమునా రాథోడ్, వడ్డేపల్లి సుభాష్‌రెడ్డిలు తెరపైకి వచ్చారు. దీంతో నల్లమడుగు సురేందర్‌ను అభద్రతాభావానికి గురి చేసినట్లయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజామాబాద్ అర్బన్ స్థానంలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బి.మహేశ్‌కుమార్‌గౌడ్ బరిలోకి దిగారు. ప్రస్తుతానికి ఆయన ఈ నియోజకవర్గానికి ఇన్చార్జిగా వ్యహరిస్తున్నారు. కానీ ఇక్కడ నరాల రత్నాకర్‌ను ఓ సీనియర్ నేత కావాలనే ప్రోత్సహిస్తున్నారన్న ప్రచారం ఉంది. ఇది నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల మధ్య గ్రూపుల గొడవలకు దారితీస్తోందని మహేశ్‌కుమార్‌గౌడ్ వర్గం అసహనం వ్యక్తం చేస్తోంది. ఇటీవల శ్రీనివాసకృష్ణన్ జిల్లాకు వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ భవన్లో నిర్వహించిన సమన్వయ సమావేశానికి ఓ వర్గం పూర్తిగా దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. రెండు నెలల కిత్రం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగిన బస్సుయాత్ర సందర్భంగా గ్రూపు విబేధాలు బహిరంగసభ వేదికపైనే బహిర్గతమయ్యాయి. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి కొత్తగా మదన్మోహన్రావును తెరపైకి తెచ్చారు. 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి సురేశ్‌షెట్కార్ పోటీ చేశారు. ఈసారి కొత్తగా మదన్మోహన్రావును పార్టీలో చేర్పించడంతో పాత, కొత్త నాయకుల మధ్య దూరం పెరిగిపోయింది. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న తమను పక్కనబెట్టి కొత్త వారికి ప్రాధాన్యత కల్పిస్తుండడంతో పార్టీ సీనియర్లు గుర్రుగా ఉన్నారు. పార్టీలో ఉన్న సీనియర్ నేతలు సమన్వయం కుదిర్చేలా వ్యవహరించాల్సింది పోయి.. గ్రూపు విభేదాలకు ఆజ్యం పోసేలా పరోక్షంగా పావులు కదుపుతున్నారనే విమర్శలున్నాయి. ఓ సీనియర్ నేతపై ఇటీవల పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇటీవల ఆ పార్టీ ఇన్చార్జి శ్రీనివాస్ కృష్ణన్‌కు, ఆర్సీ కుంతియాను కలిసి మౌఖికంగా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఇలాగే కొనసాగితే జిల్లాలో మరోమారు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం లేకపోలేదనే వాదన వినిపిస్తోంది. -
నువ్వా.. నేనా
♦ పతాక స్థాయికి అధిపత్య పోరు ♦ టీడీపీ పాత, కొత్త నేతల మధ్య పెరుగుతున్న వైరం ♦ అధికారుల బదిలీలే వేదిక నిన్న అద్దంకి సీఐ బదిలీ వ్యవహారం... ♦ నేడు ఇరిగేషన్ ప్రాజెక్టుల ఎస్ఈ రమణమూర్తి బదిలీ ♦ రమణమూర్తిని కరణం బదిలీ చేయించారని ప్రచారం... ♦ బదిలీని నిలిపివేయాలని పట్టుబట్టిన గొట్టిపాటి ♦ గొట్టిపాటిని ప్రోత్సహిస్తున్న కరణం వ్యతిరేక వర్గం సాక్షి ప్రతినిధి, ఒంగోలు: టీడీపీ పాత, కొత్త నేతల మధ్య అధిపత్యపోరు పతాక స్థాయికి చేరింది. ముఖ్యంగా పాత నేత కరణం బలరాం కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఢీ అంటే ఢీ అంటూ టీడీపీ వర్గవిభేదాలను పతాకస్థాయికి చేర్చారు. ఇటీవల అద్దంకి సీఐ బేతపూడి ప్రసాద్ వ్యవహారంలో ఇరువర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. సీఐని గొట్టిపాటి బదిలీ చేయిస్తే... కరణం ఆ బదిలీని అడ్డుకున్నారు. ఈ విషయం సమసిపోక ముందే ఇరిగేషన్ ప్రాజెక్టుల ఎస్ఈ రమణమూర్తి బదిలీ వ్యవహారం రచ్చకెక్కింది. రమణమూర్తిని ఇటీవల ఉన్నతాధికారులు విజయనగరం జిల్లాకు బదిలీ చేశారు. రమణమూర్తి బదిలీ వెనుక కరణం హస్తం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అద్దంకి నియోజకవర్గంలో నీరు-చెట్టు పనుల కోసం కరణం వర్గీయులు రూ.9 కోట్లతో ప్రతిపాదనలు ఇచ్చారు. చివరకు రూ.5 కోట్ల పనులు మాత్రమే మంజూరయ్యాయి. మిగిలిన పనులు మంజూరు కాకపోవడానికి ప్రాజెక్టుల ఎస్ఈ రమణమూర్తి కారణం అని భావించిన కరణం ఎస్ఈ బదిలీ కోసం ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం ఉంది. కరణంతో పాటు మరికొందరు అధికార పార్టీ నేతలు కూడా ఎస్ఈ బదిలీ కోసం ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఎస్ఈ బదిలీని అడ్డుకుని కరణం ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయాలని భావించిన కరణం వ్యతిరేక వర్గం గొట్టిపాటిని ముందు పెట్టి పావులు కదిపింది. దీంతో ఎస్ఈ బదిలీని నిలిపివేయాలంటూ గొట్టిపాటి రవికుమార్ శుక్రవారం గుంటూరులో ముఖ్యమంత్రిని కలిసి గట్టిగా విన్నవించారు. గొట్టిపాటి తానొక్కడే వెళ్లకుండా ఫిరాయింపు ఎమ్మెల్యేలతో కలిసి ఎస్ఈ బదిలీని నిలిపివేయాలని కోరారు. కరణం నిబంధనలకు విరుద్ధంగా పనులు మంజూరు చేయాలని ఎస్ఈపై ఒత్తిడి తెచ్చారని, ఆయన మాట విననందుకే ఎస్ఈ బదిలీకి కరణం పట్టుపట్టారని గొట్టిపాటితో పాటు ఫిరాయింపు ఎమ్మెల్యేలు సీఎంకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఈ బదిలీ వ్యవహారం ఎలా జరిగిందన్న దానిపై ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమను విచారించినట్లు సమాచారం. అనంతరం ఎస్ఈ రమణమూర్తి బదిలీని నిలిపివేయాలంటూ ముఖ్యమంత్రి ఉన్నతాధికారులకు సూచించినట్లు ప్రచారం ఉంది. మరోవైపు జిల్లా ఉన్నతాధికారి సైతం రమణమూర్తి బదిలీని నిలిపివేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. రమణమూర్తి బదిలీ ఆగిపోతే టీడీపీ వర్గపోరు పతాకస్థాయికి చేరడం ఖాయం. ఇప్పటికే అద్దంకి సీఐ వ్యవహారంలో ఓటమి చెందిన గొట్టిపాటి ఎస్ఈ బదిలీని నిలుపుదల చేయించి కరణం ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయాలని గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇక నుంచి ఒంటరిగా కాక, తనతో పాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను వెంటబెట్టుకోవడంతో పాటు టీడీపీలో కరణం వ్యతిరేక వర్గీయుల మద్దతును కూడగట్టి కరణంపై అమీతుమీకి సిద్ధపడుతున్నట్లు సమాచారం. ఇదే సమయంలో కరణం సైతం తనకు మద్దతు పలుకుతున్న పాత నేతలతో కలిసి సీఎం వద్దే తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇరువర్గాల గొడవ తీవ్రరూపం దాల్చుతోంది. చివరకు ఎవరిది పై చేయి అవుతుందో వేచి చూడాల్సిందే...! -
దాయాదులే నిందితులు..!
వీడిన పొనుగోడు హత్యకేసు మిస్టరీ నిందితుల అరెస్ట్.. కోర్డులో హాజరుపర్చిన పోలీసులు భూతగాదాలు, చేతబడి నెపంతోనే ఘాతుకం కేసు వివరాలు వెల్లడించిన సీఐ దాయాదుల మధ్య ఆదిపత్యపోరు పెచ్చరిల్లింది...ఎంతోకాలంగా ఉన్న భూతగాదాలు.. పాత కక్షలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.. అగ్నికి వాయువు తోడైనట్టు కుటుంబ సభ్యుల అనారోగ్యానికి అతడే చేతబడి చేశాడని విశ్వసించారు.. ఇంకేముంది ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నారు.. అదును చూసి మాటేసి.. మట్టుబెట్టారు.. ఇదీ గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామంలో ఇటీవల వెలుగుచూసిన ఏడిపాల వీరారెడ్డి హత్యోదంతం వెనుక ఉన్న మిస్టరీ. - హుజూర్నగర్ గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామంలో దారుణహత్యకు గురైన ఏడిపాల వీరారెడ్డి కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. విచారణలో దాయాదులే నిం దితులుగా తేల్చి, వారిని అరెస్ట్ చేశారు. శనివారం హుజూర్నగర్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్చార్జ్ సీఐ కోట నర్సిం హారెడ్డి నిందితుల వివరాలు, హత్యోదంతానికి గల కారణాలను వివరించారు. గ్రామానికి చెందిన ఏడిపాల పాపిరెడ్డి, ఏడిపాల సత్యనారాయణరెడ్డి, ఉపేందర్‌రెడ్డి, సైదిరెడ్డిలు ఇదే గ్రామానికి చెందిన ఏడిపాల వీరారెడ్డికి దాయాదులు. వీరి మ ద్య ఎంతో కాలంగా భూతగాదాలు, పాతకక్షలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఏడిపాల పాపిరెడ్డి భార్య, కుమారుడు అనారోగ్యం బారిన పడ్డారు. వీరారెడ్డి చేతబడి చేయడంతోనే వీరి ఆరోగ్యం క్షీణిం చిందని పాపిరెడ్డి అతడి సోదరులు అనుమానం పెంచుకున్నారు. ఎలాగైనా వీరారెడ్డిని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. మాటేసి.. మట్టుబెట్టి.. అదును కోసం ఎదురు చూస్తున్న పాపిరెడ్డి, అతడి సోదరులు ఈనెల 19న వీరారెడ్డి ఒంటరిగా వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది గమనించారు. సాయంత్రం మార్గమధ్యలో మాటేశారు. ఒంటరిగా ఇంటికి వస్తున్న వీరారెడ్డిని మార్గమధ్యలో పట్టుకుని ఇనుపరాడ్లతో తలపై మోది హత్య చేశారు. ఆది నుంచి వారిపైనే అనుమానాలు వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన తండ్రి వీరారెడ్డి తిరిగి రాకపోవడంతో అతడి కుమారుడు విజయ్‌భాస్కర్‌రెడ్డి ఈ నెల 20వ తేదీన గరిడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజే వీరారెడ్డి దారుణహత్యకు గురై రిజర్వాయర్ ఇసుకమేట లో మృతదేహం లభ్యమైం ది. దీంతో దాయాదులపైనే అనుమానం వ్యక్తం చేస్తూ వీరారెడ్డి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ దిశగానే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గ్రామంలోనే ఉన్న పాపిరెడ్డి, అతడి సోదరులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్టు సీఐ వివరించారు. నిందితులను కోర్టులో హాజరుపర్చ నున్నట్టు తెలిపారు. సమావేశంలో గరిడేపల్లి ఎస్ఐ జి.రాజశేఖర్‌గౌడ్, ఐడీ పార్టీ హెడ్‌కానిస్టేబుల్ బలరాంరెడ్డి,పెరుమాళ్ల శ్రీనివాస్, కత్తుల రాంబా బు, మండవ వెంకటేష్‌గౌడ్, బాల్దూరి అశోక్, మల్లికార్జున్ పాల్గొన్నారు. బ్లేడుతో గొంతుకోసి.. పగను చల్లార్చుకుని.. పాపిరెడ్డి అతడి సోదరులు వీరారెడ్డి మృతదేహాన్ని గోనెసంచిలో వేసుకుని ద్విచక్రవాహనంపై పొనుగోడు గ్రామ రిజర్వాయర్ వద్దకు తీసుకెళ్లారు. అప్పటికీ కోపంతో ఊగిపోతున్న పాపిరెడ్డి తన వెంట తెచ్చుకున్న ఎక్సాబ్లేడ్తో విగతజీవుడిగా ఉన్న వీరారెడ్డి గొంతుకోసి తన పగను చల్లార్చుకున్నాడు. అనంతరం అక్కడే గొయ్యితీసి ఇసుకమేటలో మృతదేహాన్ని పాతిపెట్టి వెళ్లిపోయారు.