దాయాదులే నిందితులు..! | Accused cousins ..! | Sakshi
Sakshi News home page

దాయాదులే నిందితులు..!

Published Sat, Jul 25 2015 11:23 PM | Last Updated on Mon, Jul 30 2018 9:15 PM

Accused cousins ..!

వీడిన పొనుగోడు హత్యకేసు మిస్టరీ
నిందితుల అరెస్ట్.. కోర్డులో హాజరుపర్చిన పోలీసులు
భూతగాదాలు, చేతబడి నెపంతోనే ఘాతుకం
 కేసు వివరాలు వెల్లడించిన సీఐ


దాయాదుల మధ్య ఆదిపత్యపోరు పెచ్చరిల్లింది...ఎంతోకాలంగా ఉన్న భూతగాదాలు.. పాత కక్షలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.. అగ్నికి వాయువు తోడైనట్టు కుటుంబ సభ్యుల అనారోగ్యానికి అతడే చేతబడి చేశాడని విశ్వసించారు.. ఇంకేముంది ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నారు.. అదును చూసి మాటేసి.. మట్టుబెట్టారు.. ఇదీ గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామంలో ఇటీవల వెలుగుచూసిన ఏడిపాల వీరారెడ్డి హత్యోదంతం వెనుక ఉన్న మిస్టరీ.              - హుజూర్‌నగర్
 
గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామంలో దారుణహత్యకు గురైన ఏడిపాల వీరారెడ్డి కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. విచారణలో దాయాదులే నిం దితులుగా తేల్చి, వారిని అరెస్ట్ చేశారు. శనివారం హుజూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్‌చార్జ్ సీఐ కోట నర్సిం హారెడ్డి నిందితుల వివరాలు, హత్యోదంతానికి గల కారణాలను వివరించారు. గ్రామానికి చెందిన  ఏడిపాల పాపిరెడ్డి, ఏడిపాల సత్యనారాయణరెడ్డి, ఉపేందర్‌రెడ్డి, సైదిరెడ్డిలు ఇదే గ్రామానికి చెందిన ఏడిపాల వీరారెడ్డికి దాయాదులు. వీరి మ ద్య ఎంతో కాలంగా భూతగాదాలు, పాతకక్షలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఏడిపాల పాపిరెడ్డి భార్య, కుమారుడు అనారోగ్యం బారిన పడ్డారు. వీరారెడ్డి చేతబడి చేయడంతోనే వీరి ఆరోగ్యం క్షీణిం చిందని పాపిరెడ్డి అతడి సోదరులు అనుమానం పెంచుకున్నారు. ఎలాగైనా వీరారెడ్డిని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు.

 మాటేసి.. మట్టుబెట్టి..
 అదును కోసం ఎదురు చూస్తున్న పాపిరెడ్డి, అతడి సోదరులు ఈనెల 19న వీరారెడ్డి ఒంటరిగా వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది గమనించారు. సాయంత్రం మార్గమధ్యలో మాటేశారు. ఒంటరిగా ఇంటికి వస్తున్న వీరారెడ్డిని మార్గమధ్యలో పట్టుకుని ఇనుపరాడ్లతో తలపై మోది హత్య చేశారు.

 ఆది నుంచి వారిపైనే అనుమానాలు
 వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన తండ్రి వీరారెడ్డి తిరిగి రాకపోవడంతో అతడి కుమారుడు విజయ్‌భాస్కర్‌రెడ్డి ఈ నెల 20వ తేదీన గరిడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజే  వీరారెడ్డి దారుణహత్యకు గురై రిజర్వాయర్ ఇసుకమేట లో మృతదేహం లభ్యమైం ది. దీంతో దాయాదులపైనే అనుమానం వ్యక్తం చేస్తూ వీరారెడ్డి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ దిశగానే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గ్రామంలోనే ఉన్న పాపిరెడ్డి, అతడి సోదరులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్టు సీఐ వివరించారు. నిందితులను కోర్టులో హాజరుపర్చ నున్నట్టు తెలిపారు. సమావేశంలో గరిడేపల్లి ఎస్‌ఐ జి.రాజశేఖర్‌గౌడ్, ఐడీ పార్టీ హెడ్‌కానిస్టేబుల్ బలరాంరెడ్డి,పెరుమాళ్ల శ్రీనివాస్, కత్తుల రాంబా బు, మండవ వెంకటేష్‌గౌడ్, బాల్దూరి అశోక్, మల్లికార్జున్ పాల్గొన్నారు.
 
 
 బ్లేడుతో గొంతుకోసి.. పగను చల్లార్చుకుని..

 పాపిరెడ్డి అతడి సోదరులు వీరారెడ్డి మృతదేహాన్ని గోనెసంచిలో వేసుకుని ద్విచక్రవాహనంపై పొనుగోడు గ్రామ రిజర్వాయర్ వద్దకు తీసుకెళ్లారు. అప్పటికీ కోపంతో ఊగిపోతున్న పాపిరెడ్డి తన వెంట తెచ్చుకున్న ఎక్సాబ్లేడ్‌తో విగతజీవుడిగా ఉన్న వీరారెడ్డి గొంతుకోసి తన పగను చల్లార్చుకున్నాడు. అనంతరం అక్కడే గొయ్యితీసి ఇసుకమేటలో మృతదేహాన్ని పాతిపెట్టి వెళ్లిపోయారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement