ఢీ.. డిష్యుం.. డిష్యుం..!
హైదరాబాద్(కుత్బుల్లాపూర్): కారు, బైక్ ఢీ కొన్నాయి.. అంతలో కారులో ఉన్న ఓ వ్యక్తి కిందకు దిగి బైక్పై వచ్చిన వ్యక్తిని కొట్టాడు. అంతే సదరు బైకిస్ట్కు చెందిన వ్యక్తులు అక్కడికి చేరుకుని కారులో ఉన్న నలుగురిని చితకబాదారు.. పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి..
సుచిత్ర నుంచి కుత్బుల్లాపూర్ వెళ్లే రోడ్డులో జయరాంనగర్ వద్ద కారు, బైక్ ఢీకొనడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. బైక్పై వెళ్తున్న వ్యక్తి స్థానికుడు కావడంతో అతడి స్నేహితులు అక్కడికి చేరుకుని కారులో ఉన్న వారిని బయటికి లాగి చితకబాదారు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరకు గొడవ పోలీస్స్టేషన్ కు చేరింది.