చరిత్రను తిరగ రాయాలి
ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించాలి
జిల్లా అధ్యక్షుడు చొక్కాకుల వెంకట్రావు పిలుపు
పాయకరావుపేట, న్యూస్‌లైన్ : రాష్ట్ర చరిత్రను తిరగరాసేలా ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు చొక్కాకుల వెంకట్రావు అన్నారు. పాయకరావుపేటలో శుక్రవా రం మండల పార్టీ విస్త్రృత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్యఅతిధిగా ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో రాష్ర్టం లో అంధకారం అలుముకుందన్నారు. మహానేత వైఎస్సార్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం చేసి అన్నదాతలకు మేలు చేశారన్నారు.
వృద్ధులు,వికలాంగులకు పెన్షన్, పేద విద్యార్థుల ఉన్నత చదువుకు పీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీతో కార్పొరేట్ స్థాయి వైద్యసేవలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయితే మళ్లీ స్వర్ణయుగం వస్తుందన్నారు. అమ్మఒడి,డ్వాక్రా మహిళలకు రుణాల మాఫీ వంటి పలు సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయన్నారు. ప్రస్తు తం జరుగుతున్న ఎన్నికలు రాష్ట్ర చరిత్ర ను తిరగరాసే ఎన్నికలన్నారు. అభ్యర్థు లు నామినేషన్ పత్రాల్లో యువజన శ్రా మిక కాంగ్రెస్ పార్టీ అని నింపాలన్నారు. ఫ్యాన్ గుర్తును ప్రచారం చేయాలన్నారు.
నియోజవర్గ సమన్వయకర్త చెంగల వెంకట్రావు మాట్లాడుతూ చంద్రబాబును నమ్మే స్థితిలో జనం లేరన్నారు. జగన్మోహన్రెడ్డిని సీఎంను చేసేందుకు ఆతృతతో ఎదురుచూస్తున్నారన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు వీసం రామకృష్ణ,రాష్ట్ర యువజన కమిటీ సభ్యుడు చిక్కాల రామారావు, మండల కన్వీనర్ కోడా కోటేశ్వరరావు, ధనిశెట్టి బాబూరావు,సర్పంచ్ ధనిశెట్టి నాగమణి,లంక సూరిబాబు,దేవవరపు వెంకటేశ్వరరావు,పెనుమత్స నాగేశ్వరరావు,తిర్పర్ణ సత్యనారాయణ,అల్లాడిశివ,ఆడారి నూకరాజు, ఆడారి ప్రసాద్, దేవవరపు శేషగిరిరావు, శివలంక నాగమల్లి, జానకి శ్రీను,కుమారరాజా పాల్గొన్నారు.
19న జగన్ రోడ్‌షో
తూర్పుగోదావరి జిల్లాలో ముగిశాక ఈ నెల 19న పాయకరావుపేటలో వైఎస్ జగన్మోహన్రెడ్డి రోడ్‌షో ఉంటుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు చొక్కాకుల వెంకట్రావు తెలిపారు. నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయి విజయవంతం చేయాలని కోరారు.