గోదావరి జలాలతో చెరువులు నింపండి
మంత్రి హరీశ్‌రావుకు రైతుల వినతి
రఘునాథపల్లి : ఆశించిన స్థాయిలో వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటి బోర్లు, బావులు ఎత్తిపోయి పంట పొలాలు, చెరువులు బీడులుగా మారాయి. గోదావరి జలాలతో చెరువులు నింపి ఆదుకోవాలని మండలంలోని మంగళబండతండా, మేకలగట్టు, ఖిలాషాపూర్‌కు చెందిన రైతులు, పార్టీల నాయకులు మంగళవారం హైదరాబాద్‌లో ఉన్న భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును కలిసి వినతిపత్రం అందించారు. గ్రామాల్లో తాగునీటి సమస్య , పశువులకు నీరు లేక అలమటిస్తున్నాయని వివరించారు.
ఖిలాషాపూర్ పటేల్ చెరువు, మేకలగట్టు మేకలమ్మ చెరువు, మండలగూడెం చెరువులను గోదావరి జలాలతో నింపితే భూగర్భ జలాలు పెరిగి తమ బతుకులు బాగుపడతాయని వేడుకున్నారు. స్పందించిన మంత్రి వెంటనే దేవాదుల సీఈకి ఫోన్ చేసి చెరువులను నింపాలని ఆదేశించినట్లు చెప్పినట్లు రైతులు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు బానోతు గోపాల్‌నాయక్, ఆలేటి సురేందర్‌రెడ్డి, బానోతు భిక్షపతినాయక్, దొంగ మహిపాల్‌రెడ్డి, గడ్డం అంజయ్య, వెంకట్‌నాయక్, ఉడుత వెంకటయ్య, తిరుపతిరెడ్డి, ఆనందం, వంగాల చంద్రయ్య, బాల్‌రెడ్డి, ఆలేటి ఉపేందర్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి ఉన్నారు.