ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సురేశ్ కొండేటి
50 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. అధ్యక్షుడిగా సురేష్ కొండేటి, ఉపాధ్యక్షులుగా ఆర్.డి.ఎస్.ప్రకాష్, సురేష్ కవిరాయని, జనరల్ సెక్రెటరీగా ఎం. లక్ష్మీనారాయణ, జాయింట్ సెక్రటరీలుగా ఎస్. నారాయణరెడ్డి ఎం.డి. అబ్దుల్, ట్రెజరర్ పి.హేమసుందర్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా.. తాటికొండ కేశవాచారి, వీర్ని శ్రీనివాసరావు, టి. మల్లిఖార్జున్, రమేష్ చందు, ధీరజ్ అప్పాజీ, నవీన్, రవి గోరంట్ల ఎన్నికయ్యారు. సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బి.ఏ. రాజు, జయ గార్ల గౌరవార్థం వారి కుమారుడు బి.ఏ. శివకుమార్ ను ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ మెంబర్ గా.. అలాగే కమిటీ ఆమోదంతో ఈసీ మెంబర్ గా తీసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ కొండేటి మాట్లాడుతూ.. ‘రెండోసారి నన్ను ప్రెసిడెంట్ ని చేయడం అనేది చాలా సంతోషంగా ఫీలవుతున్నాను. నా మీద అంత నమ్మకం ఉంచినందుకు మనస్పూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నాను. గతంలో నేను ఎలాగైతే సంస్థ అభివృదికి.. సభ్యులకు సంక్షేమానికి కృషి చేశానో.. ఇప్పుడు ఈ కమిటీలో ఉన్న సభ్యులందరి సహకారంతో ఇంకా మంచి పనులు చేయాలని.. చేస్తానని మాట ఇస్తున్నాను. ప్రతి మెంబర్ కి ఉపయోగపడేలా నిర్ణయాలు.. కమిటీ సభ్యుల ఆమోదంతో తీసుకోవడం జరుగుతుంది. సినిమా జర్నలిస్టుల అసోసియేషన్లో కీలకమైంది మాత్రం ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అని నేను ఖచ్చితంగా చెప్పగలుతాను ’అన్నారు