final desicion
-
ఆప్‌తో పొత్తుపై తుది నిర్ణయం రాహుల్‌దే
న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఆమ్ఆద్మీపార్టీ(ఆప్)తో పొత్తుపై అంతిమ నిర్ణయం తీసుకునే బాధ్యతను కాంగ్రెస్ ఢిల్లీ విభాగంపార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపైనే ఉంచింది. ఈ అంశంపై చర్చించేందుకు రాహుల్ గాంధీ అధ్యక్షతన సోమవారం ఇక్కడ జరిగిన సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షీలా దీక్షిత్‌తోపాటు ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లు దేవేందర్ యాదవ్, రాజేశ్ లిలోథియా, హరూన్ యూసఫ్ పొత్తును వ్యతిరేకించగా ఢిల్లీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు అజయ్ మాకెన్, సుభాష్ చోప్రా, తాజ్దర్ బాబర్, అర్వీందర్ సింగ్ లవ్లీ పొత్తుకు సుముఖత వ్యక్తం చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమకు సమ్మతమేనంటూ పార్టీ అధినేత రాహుల్‌కు నేతలు చెప్పారు. పొత్తుకు అనుకూలంగా ఉన్నామంటూ ఢిల్లీ ప్రాంత 12 జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు, పార్టీ నేతలు, కౌన్సిలర్ల సంతకాలతో కూడిన లేఖలను ఢిల్లీ కాంగ్రెస్ ఏఐసీసీ ఇన్‌ఛార్జి పీసీ చాకో రాహుల్‌కు అందజేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
‘పీఏ విషయంలో బాలకృష్ణదే తుదినిర్ణయం’
హిందూపురం అర్బన్/ చిలమత్తూరు/ లేపాక్షి : పీఏ శేఖర్ విషయంలో తుదినిర్ణయం బాలకృష్ణదేనని, తాను స్వయంగా ప్రకటిస్తానని ఆయన తమకు ఫోన్ ద్వారా తెలియజేశారని బీసీ కార్పొరేషన్ చైర్మన్ రంగనాయకులు చెప్పారు. మంగళవారం ఆయన పట్టణంలోని ఎమ్మెల్యే ఇంటి వద్ద విలేకరులతో మాట్లాడారు. పీఏ శేఖర్ విషయంపై పార్టీ పెద్దలు, సీఎంతో తాను చర్చిస్తున్నట్లు బాలకృష్ణ చెప్పారన్నారు.ఏ విషయాన్నీ తానే స్వయంగా ప్రకటిస్తానని, అదే ఫైనల్ అని స్పష్టం చేశారన్నారు. ముందస్తుగా పోలీసు బందోబస్తు హిందూపురం రూరల్ సీఐ రాజగోపాల్‌నాయుడు ఆధ్వర్యంలో ఎస్ఐ శ్రీధర్, పోలీసులు మంగళవారం చిలమత్తూరు, కొడికొండ గ్రామాల్లో భారీ బందోబస్తు నిర్వహించారు. పీఏ శేఖర్‌ను తొలగించారని ప్రచారం జరగడంతో సోమవారం రాత్రి అసమ్మతి నాయకులు బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. మంగళవారం ఉదయం పట్టణంలో ర్యాలీలు నిర్వహించాలని అనుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా.. పీఏ శేఖర్‌ను తొలగించారన్న ప్రచారం సాగడంతో టీడీపీ నాయకులు లేపాక్షిలోని ఎన్టీఆర్ విగ్రహానికి మంగళవారం పూలమాల వేసి నివాళులర్పించారు.