మ్యూచువల్ ఫండ్ స్కీమ్లు ఓకే
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్ స్కీమ్ల పట్ల 80 శాతానికి పైగా ఇన్వెస్టర్లు సంతృప్తిగా ఉన్నారని ఒక సర్వేలో తేలింది. 60 శాతానికి పైగా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు డిస్ట్రిబ్యూటర్ల సేవలతో సంతృప్తిగానే ఉన్నారని ఈ సర్వేలో వెల్లడైంది. ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఐఏఐ) ఈ సర్వేను నిర్వహించింది. దేశవ్యాప్తంగా అన్ని కేటగిరి ఇన్వెస్టర్లు-వ్యక్తిగత క్లయింట్లు, రిటైల్ ఇన్వెస్టర్లు, హైనెట్వర్త్ ఇన్వెస్టర్లు, అన్ని వయస్సుల వారీగా ఈ సంస్థ ఈ సర్వేను నిర్వహించింది.
సర్వే ముఖ్యాంశాలు...,
86 శాతం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు తమ ఇన్వెస్ట్మెంట్స్తో సంతృప్తిగా ఉన్నారు.
తమ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్తో అసంతృప్తిగా ఉన్న ఇన్వెస్టర్లు 14 శాతంగా ఉన్నారు.
మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్ స్కీమ్ల పట్ల డిస్ట్రిబ్యూటర్లు తగిన అవగాహనను కలిగి ఉండాలని, సకాలంలో కస్టమర్ సర్వీసులందజేయాలని ఇన్వెస్టర్లు కోరుకుంటున్నారు.
మ్యూచువల్ ఫండ్ స్కీమ్లు మరింత పారదర్శకంగా ఉండాలని, ఇన్వెస్టర్ల ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని ఎక్కువ మంది ఇన్వెస్టర్లు వాంఛిస్తున్నారు.