స్మితా సబర్వాల్‌కు వారెంట్
మదనపల్లె: తెలంగాణ సీఎం కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితాసబర్వాల్‌కు చిత్తూరు జిల్లా మదనపల్లె ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు గురువారం బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మదనపల్లె మండలం కొండ్రామర్రిపల్లె సమీపంలోని గాయత్రి క్రషర్స్ (క్వారీ)లోని 39 మంది తమిళనాడు కూలీలను వెట్టిచాకిరీ నుంచి అప్పటి సబ్‌కలెక్టర్ స్మితాసబర్వాల్ విముక్తి కల్పించారు. యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. రెండుసార్లు సమన్లు జారీ చేసినా ఆ కేసు విచారణ నిమిత్తం ఆమె కోర్టుకు హాజరుకాలేదు. దీంతో న్యాయమూర్తి ప్రదీప్‌కుమార్ ఈ కేసును ఈ నెల 15కు వాయిదా వేస్తూ స్మితాసబర్వాల్‌కు బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.