First nude Restaurant
-
ఆ నగ్న రెస్టారెంట్ ఇక లేనట్లే
పారీస్ : సమాజపు కట్టుబాట్లను కాసేపు పక్కనబెట్టి ఎంచక్కా నచ్చినట్లు నగ్నంగా రెస్టారెంట్లో గడపాలనుకునే వారికి స్వర్గధామంలాంటి ‘ఓ న్యాచురల్ రెస్టారెంట్ ’మూతపడనుంది. 2016లో ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్ ప్రపంచంలోనే తొలి న్యూడ్ రెస్టారెంట్‌గా గుర్తింపు పొందింది. అప్పట్లో ఈ రెస్టారెంట్ గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంది. ఒంటి మీద నూలుగు పోగు లేకుండా నగ్నంగా రావాలని కండీషన్ పెట్టడమే ఇందుకు కారణం.అయితే గిరాకీ లేకపోవడంతో ఫిబ్రవరిలో ఈ రెస్టారెంట్‌ను మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఫ్రాన్స్ రాజధాని పారీస్ కు చెందిన 43 ఏళ్ల ట్విన్స్ మైక్, స్టీఫెన్లు 2016లో ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఇందులో ఏమైనా తినాలంటే బట్టలు విప్పి లోపల అడుగు పెట్టాల్సిందే. ఫోన్లు, బట్టలు, కెమెరాలు లాంటివన్నీ పెట్టుకునేందుకు కస్టమర్లకు లాకర్లు కూడా ఏర్పాటు చేశారు. రెస్టారెంట్ లోపలికి ఎటువంటి కెమెరాలనూ అనుమతించరు. ప్రకృతి ప్రేమికుల కోసం ఈ రెస్టారెంట్ ఓపెన్ చేశామని ట్విన్స్ మైక్, స్టీఫెన్లు పేర్కొన్నారు. అయితే కస్టమర్ల సంఖ్య తగ్గి నష్టం రావడంతో ఫిబ్రవరిలో రెస్టారెంట్ మూసివేస్తున్నామని యాజమాన్యం వెల్లడించింది. ‘ఓ న్యాచురల్ రెస్టారెంట్‌కు వచ్చే జనాల సంఖ్య విపరీతంగా తగ్గింది. పెట్టిన ఖర్చులో కేవలం 40 శాతం మాత్రమే రెవెన్యూ వస్తోంది. అందుకే ఫిబ్రవరిలో రెస్టారెంట్ మూసేస్తున్నాం. న్యూడ్ అనుభవం పొందాలనుకునేవారు త్వరగా వచ్చేయండి...’’అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు నిర్వాహకులు. అయితే నగ్నంగా వింధు చేసేందకు జనాలు సాహసించకపోవడంతో ప్రపంచపు మొట్టమొదటి న్యూడ్ రెస్టారెంట్ కొద్దిరోజుల్లో చరిత్రలో కలిసి పోనుంది. -
లండన్‌లో తొలి నగ్న రెస్టారెంట్!
లండన్: బాహ్య ప్రపంచపు కట్టుబాట్లను కాసేపు పక్కనబెట్టి ఎంచక్కా నచ్చినట్లు నగ్నంగా రెస్టారెంట్లో గడపాలనుకునే వారికి స్వర్గధామంలాంటి రెస్టారెంట్ ఒకటి లండన్‌లో ప్రారంభానికి సిద్ధమైంది. ‘ది బునియాది(పునాది)గా పిలిచే ఈ రెస్టారెంట్లో తప్పదనుకుంటే పొదుపుగా దుస్తులను వేసుకున్న వారికీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శాఖాహార, మాంసాహార వంటలను మట్టికుండల్లో, ‘తినగల’ చెంచాలతో వడ్డిస్తారు. ఈ చెంచాలను ఆహారపదార్ధాలతో తయారుచేస్తారు. రసాయనాలులేని వంటలు ఈ రెస్టారెంట్ ప్రత్యేకత. ఇప్పటికే రెస్టారెంట్‌కు వెయిటింగ్ లిస్ట్ ఏకంగా 44,200కు చేరింది. రెస్టారెంట్లో ఒకేసారి కేవలం 42 మంది మాత్రమే కూర్చునే సదుపాయం ఉంది. విద్యుత్, ఫోన్, దుస్తులు ఇలా ఎలాంటివి లేని ప్రపంచాన్ని పరిచయం చేయడం కోసం ఈ రెస్టారెంట్‌ను నెలకొల్పినట్లు రెస్టారెంట్ మాతృసంస్థ అయిన ‘లాలీపాప్’ వ్యవస్థాపకుడు సెబ్ లేయాల్ ప్రకటించారు. శనివారం ప్రారంభంకానున్న ఈ రెస్టారెంట్లో పూర్తి నగ్నంగా ఉండే కస్టమర్ల అభిరుచికి తగ్గట్లుగా ఇంటీరియర్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. కొవ్వొత్తుల కాంతుల్లో.. వెదురుకర్రలతో చేసిన ఏర్పాట్లు రెస్టారెంట్‌కు కొత్త శోభను తెస్తాయన్నారు.