కాజీపేట–ముంబై మధ్య ఐదు రైళ్లు
కాజీపేట రూరల్ : జిల్లా ప్రజలు ముంబైకి వెళ్లేందుకు కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్ల నుంచి ఐదు ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.
కాజీపేట–ఎల్టీటీ తడోభా ఎక్స్‌ప్రెస్..
కాజీపేట–ఎల్టీటీ వెళ్లే తడోభా ఎక్స్‌ప్రెస్‌ను సోమవారం రైల్వే మంత్రి సురేష్ కుమార్ ప్రభు ప్రారంభించారు. ఈ రైలు మంగళవారం ముంబై చేరుకుంటుంది. అయితే ఇకపై ఈ రైలు రెగ్యులర్ వీక్లి ట్రైన్‌గా ప్రతి శనివారం కాజీపేట జంక్షన్ నుంచి బయలుదేరి ఆదివారం ముంబై వెళుతుంది.
11083 నంబర్ గల ఎల్టీటీ–కాజీపేట వెళ్లే తడోభా ఎక్స్‌ప్రెస్ సోమవారం ఉదయం 8 గంటలకు ఎల్టీటీలో ప్రారంభమై మంగళవారం ఉదయం 11.25 గంటలకు కాజీపేటకు చేరుకుంటుంది. తిరిగి మంగళవారం సాయంత్రం 5.45 గంటలకు 11084 నంబర్‌తో కాజీపేట నుంచి ఎల్టీటీకి బయలుదేరుతుంది. ఆ తర్వాత ప్రతి శుక్రవారం ఎల్టీటీలో ఉదయం 8 గంటలకు బయలు దేరి శనివారం ఉదయం 11.25 గంటలకు కాజీపేటకు చేరుకుంటుది. తిరిగి అదే రోజు సాయంత్రం 5.45 గంటలకు బయలుదేరి ఆదివారం 12.45 గంటలకు ఎల్టీటీకి చేరుకుంటుంది.
ఆనంద్‌వన్ ఎక్స్‌ప్రెస్..
22127 నంబర్ గల ఆనంద్‌వన్ ఎక్స్‌ప్రెస్ ప్రతి సోమవారం ఎల్టీటీలో 13.45 గంటలకు బయలు దేరి మంగళవారం ఉదయం 7 గంటలకు కాజీపేట చేరుకుంటుంది. తిరిగి కాజీపేటలో సాయంత్రం 18.30 గంటలకు బయలు దేరి బుధవారం 13.45 గంటలకు ఎల్టీటీకి వెళ్తుంది.
రెగ్యులర్ రైళ్లుగా..
18519 నంబర్ గల విశాఖ–ఎల్టీటీ లోకమాన్యతిలక్ ఎక్స్‌ప్రెస్ ప్రతి రోజు కాజీపేటకు ఉదయం 10.10 గంటలకు చేరుకుంటుంది. 18520 నంబర్ గల ఎల్టీటీ–విశాఖ వెళ్లే లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ ప్రతి రోజు రాత్రి 23.30 గంటలకు కాజీపేటకు చేరుకుంటుంది.
కోణార్క్ ఎక్స్‌ప్రెస్..
11020 నంబర్ గల భువనేశ్వర్–ముంబాయి వెళ్లే కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ప్రతి రోజు ఉదయం 8.40 గంటలకు కాజీపేటకు వస్తుంది. తిరిగి 11019 నంబర్ గల ముంబాయి–భువనేశ్వర్ వెళ్లే కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ప్రతి రోజు ఉదయం 10.20 గంటలకు కాజీపేటకు వస్తుంది.